ఉస్మానియా యూనివర్శిటీ  విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'జార్జిరెడ్డి' సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కానుంది. ‘జార్జిరెడ్డి’ సినిమాలో సందీప్‌ మాధవ్‌ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమాకు జీవన్‌రెడ్డి దర్శకత్వం వహించాడు.  అప్పిరెడ్డి, సంజయ్‌రెడ్డి, దామోదర్‌ రెడ్డి నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రం ..  నవంబరు 22న విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఫోర్త్‌ లేక్‌ వ్యూ ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ నెల 22, 23న సినిమాను ఢిల్లీ, నోయిడాల్లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సినిమా యూనిట్ హర్షం
చిన్న సినిమాల కేటగిరిలో వచ్చిన  ‘జార్జిరెడ్డి’ సినిమా .. పరిశ్రమతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది.  ఇప్పుడు ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కు ఎంపిక కావడం పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో  చిత్ర యూనిట్‌ పాల్గోనుంది.