Gold Price Today August 7th 2022 : వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధర ఆదివారం (ఆగస్టు 7) స్వల్పంగా దిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 మేర ధర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 నుంచి రూ.47,550కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 నుంచి రూ.51,870కి చేరింది. హైదరాబాద్, విజయవాడ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం (ఆగస్టు 6) రూ.47,650 ఉండగా ఇవాళ (ఆగస్టు 7) రూ.47,550కి దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 నుంచి రూ.51,870కి తగ్గింది


ఏపీలోని విజయవాడ,విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉంది. 


దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా:


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,036గా ఉంది.


దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతా, కేరళలోని నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉంది. 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,850గా ఉంది.


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930గా ఉంది.


మహారాష్ట్ర పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,580 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,900గా ఉంది. 


గత జూలై 5న బులియన్ మార్కెట్‌లో అత్యధిక బంగారం ధర నమోదైంది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,470గా నమోదైంది. ప్రస్తుత ధరలు ఆ ధరలకు చేరువగా ఉన్నాయి. గడిచిన 10 రోజుల్లో 5 సార్లు బంగారం ధరలు పెరగ్గా.. 3 సార్లు మాత్రమే ధరలు దిగొచ్చాయి. బంగారంపై జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నులు, అలాగే మార్కెట్‌ డిమాండ్ కారణంగా ఆయా నగరాల్లోని బంగారం ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, డాలరుతో రూపాయి మారకం విలువ తదితర అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి. 


Also Read: Horoscope Today August 7th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారి ప్రేమ బంధం మరింత వికసిస్తుంది...


Also Read: Addanki Dayakar Comments: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి అద్దంకి దయాకర్ క్షమాపణలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook