అహ్మదాబాద్: లాక్ డౌన్ కారణంగా గృహ హింసలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయని ప్రపంచ స్థాయి నివేదికలు ప్రకటిస్తున్న తెలిసిందే. ఇదే క్రమంలో గుజరాత్ లో వడోదరలో ఓ వ్యక్తి తన భార్యపై దారుణంగా దాడికి దిగి ఆమెను హింసించాడు. ఆన్ లైన్ లూడో గేమ్ లో భర్తపై గెలవడాన్ని చూసి తట్టుకోలేక ఈ దాడి చేశాడు. వడోదరలోని వేమలి ప్రాంతంలో నివసించే ఆ 24 ఏళ్ల యువతి వృత్తి రీత్యా పరిసర ప్రాంతంలో సాయంత్రం హోమ్ ట్యూషన్ కేంద్రాన్ని నడిపిస్తోంది. ఆమె భర్త ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేసేవాడని, లాక్ డౌన్ సమయంలో భర్త ఇరుగుపొరుగుతో గడపడం చూసి, అతడ్ని ఇంట్లోనే ఉంచేందుకు ఫోన్ లో లూడో గేమ్ ఆడదామని ప్రతిపాదించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. విమర్శలు, డిమాండ్స్


అయితే ఈ లూడో గేమ్ లో వరుసగా నాలుగు రౌండ్ల పాటు భార్యదే పైచేయి కాగా, భర్త ఓడిపోయాడు. దీన్ని అవమానంగా భావించిన ఆయన భార్యపై కిరాతకంగా దాడి చేసి కిందపడేసి అమానుషంగా కొట్టాడు. దాంతో ఆమె వెన్నెముకకు తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రిపాలైంది. చికిత్స అనంతరం భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. తన తల్లిదండ్రుల వద్దకు వెళతానని స్పష్టం చేసింది. అయితే ఓ హెల్ప్ లైన్ సంస్థ భార్యభర్తల మధ్య ఒప్పందం కుదర్చడంతో కుటుంబ సమూహంలో పరిష్కారం అయిందని ఆమె తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..