Hero Nani Upcoming Movies: నాచురల్ స్టార్ నాని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రస్తుత సినిమాలేమిటి ఆయన నటించబోయే సినిమాలేమిటి అనే విషయం మీద ఒక లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. చివరిగా నాచురల్ స్టార్ నాని శ్యాం సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా ఆయన కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత ఆయన నటించిన అంటే సుందరానికి సినిమా మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివేకా త్రేయ దర్శకత్వంలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నాని హీరోగా నటించిన ఈ అంటే సుందరానికి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కానీ ఓటీటీలో మాత్రం ఒక రేంజ్ లో ఆడింది. ఇక నాని చివరిగా హిట్ ది సెకండ్ కేసు సినిమాలో ఒక అతిథి పాత్రలో కనిపించాడు. ఈ సినిమాకి స్వయంగా నాని నిర్మాత కావడం, మూడో పాత్రలో నాని హీరోగా నటిస్తున్న నేపథ్యంలో రెండో పాత్రలో ఆయన కేవలం రెండు మూడు నిమిషాల పాటు కనిపించారు. ఇక ప్రస్తుతం నాని చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన దసరా అనే సినిమా చేస్తున్నాడు. ధరణి అనే పాత్రలో గోదావరిఖని నేపథ్యంలో ఆయన ఈ సినిమాలో నటిస్తున్నాడు.


సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నాని కెరియర్ లోనే మొట్టమొదటి ప్యాన్ ఇండియా సబ్జెక్టుగా తెరకెక్కిన ఈ సినిమా కోసం నాని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని తన కెరియర్లో 30వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ కూడా ఈ మధ్యనే ఘనంగా జరిగింది. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సివి మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తికేఎస్ ఈ సినిమాని పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు.


ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన మోహన్ చెరుకూరి బయటకు వచ్చేసి ఇప్పుడు ఈ వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థను నెలకొల్పారు. ఇక ఈ సినిమాకి ఖుషి సినిమాకి సంగీతం అందిస్తున్న మలయాళ సంగీత దర్శకుడు సంగీతం అందిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. మలయాళంలో హృదయం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా సంగీతం అందిస్తూ వస్తున్నాడు. ఇక నాని తరువాత తన సొంత నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ మూడవ సినిమాలో భాగంగా కాబోతున్నాడు. ఇవేనండీ నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు.


Also Read: Puja Banerjee Bareback Photo: బ్యాక్ మొత్తం కనిపించేలా పూజా హాట్ ట్రీట్.. చూశారా?


Also Read: Sravanthi Chokarapu on Exposing: నా బట్టలు నా ఇష్టం.. మీకేంటి నొప్పి అంటున్న స్రవంతి చొక్కారపు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook