జిగర్‌తండ రీమేక్‌పై కన్నేసిన డైరెక్టర్ హరీష్ శంకర్
జిగర్‌తండ రీమేక్‌పై దృష్టిసారించిన డైరెక్టర్ హరీష్ శంకర్
దువ్వాడ జగన్నాథం సినిమాతో భారీ డిజాష్టర్‌ని మాటగట్టుకున్న దర్శకుడు హరీష్ శంకర్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఓ రీమేక్ సినిమాపై ఇటీవలే పనిమొదలు పెట్టినట్టు తెలుస్తోంది. తమిళంలో హిట్ అయిన జిగర్‌తండ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 2014లో సిద్ధార్థ్ హీరోగా కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లోనే చిక్కడు దొరకడు అనే టైటిల్‌తో తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది. అయితే, ఆ డబ్బింగ్ వెర్షన్‌కి అంత ఆదరణ లభించకపోవడంతో ఆ సినిమా ఎంత సైలెంట్‌గా వచ్చిందో అంతే సైలెంట్‌గా థియేటర్స్ నుంచి వెళ్లిపోయింది. అందుకే ఆ చిత్రాన్ని తెలుగులో తనదైన స్టైల్లో రీమేక్ చేసి హిట్ కొట్టాలని హరీష్ శంకర్ ఉవ్విళ్లూరుతున్నాడట. గ్యాంగ్ స్టర్స్ జీవితాలపై ఓ సినిమాను తెరకెక్కించి, ఫిలింమేకర్‌గా పేరు తెచ్చుకోవాలనే బలమైన కోరికతో ఓ యంగ్ స్టర్ మొదలుపెట్టిన ప్రయత్నం ఆ తర్వాత ఎన్ని మలుపులు తిరిగిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది.
శర్వానంద్ హీరోగా ఈ రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్న హరీష్ శంకర్.. ఈ రీమేక్‌తో ఎలాగైనా మళ్లీ తనను నిరూపించుకోవాలనుకుంటున్నాడు. గతంలో 'దబాంగ్'ను గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన ఘనత హరీష్ శంకర్ సొంతం. మరి 'గబ్బర్ సింగ్'లాగే 'జిగర్‌తండ'తోనూ సక్సెస్‌ను నమోదు చేసుకుంటాడో లేదో ఆ సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం.