Gut Health: ఈ చిట్కాలు పాటిస్తే మీ ప్రేవులు ఫుల్ క్లీన్, మలబద్ధకం, గ్యాస్ అన్ని సమస్యలు మాయం
Gut Health: శరీరంలో అంతర్గతంగా జరిగే ఎన్నో మార్పులు వివిధ అనారోగ్య సమస్యలు, వ్యాధులుగా పీడిస్తుంటాయి. కడుపు సంబంధిత సమస్యలు చాలా రకాల వ్యాధులకు కారణమౌతుంటాయి. ప్రేవుల సమస్య ఇందులో ప్రధానమైంది.
ప్రేవుల్లో సమస్య ఉంటే తరచూ విసుగు, గ్యాస్, స్వెల్లింగ్, మలబద్ధకం, కడుపులో మంట వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ప్రేవులు శుభ్రంగా ఉంటే ఏ విధమైన సమస్యలు దరిచేరవు. ప్రేవుల్లో పేరుకుపోయే వ్యర్ధాలు ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపిస్తాయి. కొన్ని రకాల హోమ్ మేడ్ డ్రింక్స్‌తో ప్రేవుల్ని సమూలంగా శుభ్రం చేయవచ్చు.
వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుకోవాలంటే..శరీరంలో వివిద అంగాలు శుభ్రంగా ఉండటం అవసరం. శరీరాన్ని బాహ్యంగా స్నానపానాదులతో ఎలా శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తామో అంతర్గతంగా కూడా అదే శుభ్రత అవసరం. ముఖ్యంగా శరీరం నుంచి వ్యర్ధ పదార్ధాలు బయటకు వెళ్లే అంగాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ప్రేవులు ఇందులో ప్రధానమైనవి. ప్రేవుల ద్వారా శరీరంలోని వ్యర్ధాలు బయటకు తొలగిపోతాయి. ఎందుకంటే ప్రేవులు శుభ్రంగా లేకపోతే..వివిధ రకాల అనారోగ్య సమస్యలు గ్యాస్, స్వెల్లింగ్, మలబద్ధకం, అజీర్తి, కడుపులో మంట వంటివి ఎదురౌతుంటాయి. అయితే ప్రేవులు శుభ్రంగా ఉంచేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ముఖ్యంగా నాలుగు హోమ్ మోడ్ డ్రింక్స్ సహాయంతో ప్రేవుల్ని శుభ్రం చేయవచ్చు. అంటే ఈ 4 డ్రింక్స్ మీ ప్రేవుల్ని పూర్తిగా డీటాక్స్ చేసేస్తాయి.
అన్నం గంజి
అన్నం గంజి నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిది. దేశంలో చాలా ప్రాంతాల్లో అన్నం గంజికి విశేష ప్రాధాన్యత ఉంది. అన్నం ఉడికిన నీళ్లను ఓ ప్రత్యేక విధానంతో పర్మంటేషన్ చేస్తారు. ఇందులో పెరుగు లేదా మజ్జిగ కూడా కలుపుతారు. కొంతమంది ఇందులో మసాలా, మూలికలు వేస్తారు. సహజసిద్ధమైన ప్రోబయోటిక్‌లా పనిచేస్తుంది. ప్రేవుల్లో వ్యర్ధాల్ని తొలగించేందుకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
గాజర్ గంజి
క్యారెట్‌ను ఉడికించినన నీళ్లలో మసాలా, ప్రత్యేకమైన విధానంలో పర్మంటేషన్ ద్వారా తయారౌతుంది. ప్రేవులకు ఇది చాలా మంచిది. ప్రేవుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాను ఇది పెంచుతుంది. రుచిలో పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండే దీనిని చాలామంది ఇష్టపడతారు.
బీట్‌రూట్ గంజి
బీట్‌రూట్ జ్యూస్, నీళ్లు కలిపి పర్మంటేషన్ చేస్తారు. ఇందులో కొన్ని ప్రత్యేకమైన మసాలాలు కలుపుతారు. ఆ తరువాత బీట్‌రూట్ గంజి సిద్ధమౌతుంది. లంచ్, డిన్నర్‌కు ముందు రోజూ ఒక కప్పు తాగితే మంచి ఫలితాలుంటాయి. ప్రేవులు పూర్తిగా శుభ్రమౌతాయి.
Also read; Health Tips: అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టే అద్భుత చిట్కా, కిస్మిస్‌తో ట్రై చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook