చాలామంది ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావంతో వడదెబ్బ, డీహైడ్రేషన్‌లకు గురవుతుంటారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ఎండాకాలంలో ఏమేం పనులు ఎప్పుడు చేయాలో.. చేయకూడదో తెలుసుకుందాం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చేయాల్సినవి


 

* నీరు పళ్లరసాలు, కొబ్బరినీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి.


* శుభ్రంగా రెండు పూట్ల స్నానం చేయాలి. భోజనం మితంగా చేయాలి.


* లేత వర్ణం, తేలికైన, కాటన్ దుస్తులు ధరించాలి.


* ఆరు బయట పడుకున్నా దోమతెరల వంటివి వాడుకోవాలి.


* ఎండవేళ ఇంటిపట్టునే ఉండాలి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీల లాంటివి తీసుకెళ్లాలి.


* ఇంట్లో కిటికీ తలుపులు తెరిచి ఉంచండి. ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలి.


చేయకూడనివి


* వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయట ఎక్కువగా తిరగకూడదు.


* ఇంటిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో శుభ్రత పాటించి, దోమలు లేకుండా చూసుకోవాలి.


* రోడ్ల మీద అమ్మే చల్లని రంగు పానీయాలను, కూల్ డ్రింక్స్ లను తాగకూడదు.


* మాంసాహారాన్ని తగ్గించాలి. ఆహారంలో తాజా ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.


వడదెబ్బ తగిలితే ప్రథమ చికిత్స


* వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడగల ప్రదేశానికి చేర్చాలి.


* ఐస్ నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి.


* శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేవరకు ఇలా చేస్తుండాలి.


* ఫ్యాను గాలి, చల్లని గాలి తగిలేలా ఉంచాలి.


* ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్, ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం (ఓఆర్‌ఎస్)లను తాగించవచ్చు.


* వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు.


* వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.