ట్రాఫిక్ సిగ్నల్ డైరెక్షన్ ఆధారంగా మనం వాహనం నడపడం చేస్తుంటాం.. అయితే పైన కనిపిస్తున్న ఫోటో చూసి ఏం చేయాలో చెప్పగలరా ?..ఏ డైరక్షన్ లో  వెళ్లాలో అర్థం చేసుకోగలరా. ఆ ట్రాఫిక్ సిగ్నల్‌లో రెడ్‌లైట్ ఆన్‌లో ఉంది. దీంతోపాటు లెఫ్ట్, స్ట్రెయిట్ డైరెక్షన్స్ సూచిస్తోంది. ఇదండి మన ట్రాఫిక్ విధానం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి అరుదైన దృశ్యాన్ని ఫోటోలో బంధించి టాలీవుడ్ హీరో నవదీప్ తన ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.  ‘జీవితంలో ఎలాంటి డైరెక్షన్ లేకుండా.. నన్ను అవమానించడం మానండి’ అంటూ కాప్ఫన్ ఇచ్చాడు.


నవదీప్ సరదాగా పెట్టిన పోస్టుపై నెటిజన్లు కూడా అంతే సరదాగా స్పందిస్తున్నారు. 'గుడ్ వన్ ' అని ఒకరు..  ‘ ఏ ఏరియా’ అని ఒకరు.. ‘భయానకం’గా ఉందని ఒకరు .. ‘అన్నా ఒకసారి ఆగి...లెఫ్ట్‌కి వెళ్లి..అప్పుడు రైట్‌కి వెళ్లు’ అని మరొకరు సూచిస్తూ సరదా సరదా కామెంట్స్ పెడుతున్నారు. మీరూ మీకు నచ్చిన కామెంట్ చేసి ఎంజాయ్ చేయండి..