టాలీవుడ్ రీ ఎంట్రీకి లవర్ బాయ్ గ్రీన్ సిగ్నల్ !!
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఓ టాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు
టాలీవుడ్ కు సుపరితుడైన లవర్ బాయ్ సిద్దార్థ్ రీ ఎంట్రీ కి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా సిద్ధార్థ్ ..లేటెస్ట్ గా ‘గృహం’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పలకరించాడు. అయితే ఇంతటితో సంతప్తి చెందని సిద్దార్థ్..టాలీవుడ్ మూవీలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు.
సంచలన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో నెక్స్ట్ మహాసముద్రం మూవీలో మాస్ మహారాజ రవితేజతో నటించేందుకు సిద్దు ఒప్పకున్నాడట. తెలుగులో వరుస ప్రేమకథలతో లవర్ బాయ్ ఇమేజ్ అందుకున్న సిద్దార్థ్ మరి ఈ మల్టి స్టార్ మూవీలో ఎలాంటి పాత్రలో చేయబోతున్నాడో అని తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.