Hero Sushanth fires on Comedian Sudarshan: సుశాంత్ ప్రధాన పాత్రలో ప్రియా ఆనంద్ కీలక పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ మా నీళ్ల ట్యాంక్ . ప్రస్తుతం జి5 వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. జూలై 15వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ జి 5లో అందుబాటులోకి వచ్చింది. సుశాంత్, ప్రియా ఆనంద్, సుదర్శన్, 'బిగ్ బాస్' దివి, ప్రేమ్ సాగర్, నిరోషా, అప్పాజీ అంబరీష, రామరాజు తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా గురువారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సరదాగా ఒక స్కిట్ వేశారు. కమెడియన్ సుదర్శన్ యాంకర్ గా వ్యవహరించగా సుశాంత్ సిరీస్ లో తన పేరైన వంశీ పేరుతో హీరోగా ఎంట్రీ ఇస్తాడు. ముందు సుదర్శన్ హీరోయిన్ ను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చానని, ఇలా హీరో వస్తున్నాడు అంటే తాను ఇంటర్వ్యూ చేసేవాడిని కాదని సుదర్శని అంటాడు. అయితే ఎలాగూ వచ్చావు కదా చేసేసి వెళ్ళిపోమని సుదర్శన్ తో సుశాంత్ అంటాడు. అలా సరదా సరదాగా సాగిపోతున్న సమయంలో సుదర్శన్ తనకు వెబ్ సిరీస్ అంటే చిన్న చూపు ఉందనే విషయాన్ని బయటపెడతాడు. 


దీంతో సుశాంత్ విశదీకరించి మరీ వెబ్ సిరీస్ అంటే ఏమీ తక్కువ కాదు, వెబ్ సినిమా అన్నా తక్కువ కాదు. ఏదైనా కంటెంట్ ఏ కదా అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అయితే సుశాంత్ తప్ప మిగతా వాళ్ళందరూ కొత్తవాళ్లు అనబోతూ ఉంటే ఎవరూ కొత్తవాళ్లు కాదని ప్రియా ఆనంద్ లాంటి హీరోయిన్ కూడా నటించిందని సుశాంత్ అంటాడు. డైరెక్టర్ కొత్తవారు అంటే డైరెక్టర్ కూడా కొత్తవారు కాదు వరుడు కావాలని డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారని అంటాడు. 


ఇంత మంది టాలెంటెడ్ పీపుల్ పనిచేస్తున్నారంటే ఇందులో ఏదో విషయం ఉంది కదా అంటూ చెప్పుకొస్తాడు సుశాంత్. చివరికి మనలో మన మాట మీకు సినిమాలు రావట్లేదా అని అడిగితే సినిమాలు వస్తున్నాయని, రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమాలో తాను కూడా నటిస్తున్నానని సుశాంత్ అంటాడు. అలాగే తాను హీరోగా ఒక సినిమా ప్రారంభం కావాల్సి ఉందని త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే తాను కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలలో నటించాను కానీ ఆ విషయం ఎడిటర్కి నాకు తెలియదని సినిమా విడుదలయ్యాక అందులో సీన్స్ ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు అంటూ సుదర్శన్ చెప్పుకొచ్చాడు. 


దీంతో కాస్త సీరియస్ అయిన సుశాంత్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సినిమాలు లేక వెబ్ సిరీస్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. సినిమాలు లేకపోతేనే వెబ్ సిరీస్ చేయాలా వెబ్ సిరీస్ చేస్తున్న వారంతా సినిమాలు లేక చేస్తున్నారా అంటూ ఫైర్ అవుతాడు. అయితే సరదా సరదాగా సాగిపోతున్న క్రమంలో సుశాంత్ సీరియస్ అవ్వడంతో చుట్టూ ఉన్న అందరూ ఒకసారి గా షాక్ అవుతారు. తర్వాత ప్రమోషన్స్ కోసమే అని తెలియడంతో కాస్త తేరుకుంటారు. 
Also Read: Pratap Pothen: రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్ కన్నుమూత


Also Read: Jabardasth Yedukondalu: కిరాక్ ఆర్పీ సినిమా అందుకే ఆగింది.. అసలు ఫ్రాడ్ బయటపెట్టిన ఏడుకొండలు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.