Honey For Weight Loss In 4 Days: ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు వివిధ రకాల దీర్ఘకాలీక సమస్యలు కూడా గురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో చాలా హోం రెమెడీస్ ఉన్నాయి. ముఖ్యంగా తేనెతో కలిగిన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో తేనె కలుపుకుని తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలంటే తేనెలో ఏం కలుపుకుని తినాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని తేనెలో కలిపి తినండి  


1. తేనె, నిమ్మకాయ:
తేనె, నిమ్మ మిశ్రమం బరువును తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఎలాంటి ప్రోడక్ట్స్‌ వినియోగించకుండా బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా మీరు ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ, 1 టీస్పూన్ తేనె మిక్స్ చేసి త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.


2. తేనెతో వెల్లుల్లి:
ఊబకాయం తగ్గాలంటే వెల్లుల్లిని తేనెతో కలిపి తినండి. ఇలా క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం మీరు వెల్లుల్లిని పేస్ట్‌గా చేసి..2 టీస్పూన్ల తేనెను మిక్స్ చేసి గోరువెచ్చని నీటితో త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే రక్త పోటు సమస్యలు కూడా దూరమవుతాయి.


3. తేనె, పాలు:
 పాలలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అయితే మరిగించిన పాలతో కూడా బరువు తగ్గొచ్చు. దీని కోసం మరిగించిన ఒక గ్లాసు పాలలో 2 టీస్పూన్ల తేనె కలుపుకుని తాగాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు, శరీరానికి రోగ నిరోధక శక్తి లభిస్తుంది.


4. బ్రౌన్ బ్రెడ్‌ని తేనెతో కలిపి తినండి:
బరువు తగ్గే క్రమంలో చాలా మంది డైట్‌ను పాటిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో తప్పకుండా చేయాల్సింది ఏంటంటే.. బ్రౌన్ బ్రెడ్‌పై తేనెను కలుపుకుని ఉదయం టిఫిన్‌లో భాగంగా తీసుకుంటే బరువు తగ్గడమేకాకుండా సులభంగా అనారోగ్య నమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


5. మజ్జిగలో తేనె కలుపుకుని తాగండి:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలకు చెక్‌ పెట్టడానికి  మజ్జిగలో తేనె కలుపుకుని తాగండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల బరువు తగ్గడమేకాకుండా పొట్టలో సమస్యలు కూడా దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook