How to Control Diabetes by Eating Guava: అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. వ్యాయామాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం కావడమేకాకుండా దృఢంగా తయారవుతాయి. అయితే చాలా మంది ఆధునిక జీవన శైలికారణంగా మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ఈ మధుమేహం నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా కొన్ని హోం రెమెడీని వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల సులభంగా మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం ఉన్నవారు ఇవి తినండి:
జామపండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి:

 షుగర్ పేషెంట్లు జామపండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల సులభంగా అన్ని రకాల వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా ఈ పండులో విటమిన్‌-ఎ, విటమిన్‌-బి, విటమిన్‌-సి, ఫాస్పరస్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీరంలోని రక్త పరిమాణాలను తగ్గించి మధుమేహాన్ని తగ్గిస్తుంది.


గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది:
జామకాయలో ఫైబర్ కూడా తగినంత పరిమాణంలో ఉంటుంది. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేయడానికి ఈ ఫైబర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మధుమేహం ఉన్నవారు వినియోగిస్తే మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు.


జామ ఆకులతో చేసిన టీ:
జామకాయ మాత్రమే కాదు.. దాని ఆకులు కూడా మధుమేహంతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా పని చేస్తుంది. కాబట్టి తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడేవారు నియంత్రించడానికి జామ ఆకులతో చేసిన టీని తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీ తాగడం వల్ల ఇన్సులిన్ స్థాయి కూడా అదుపులో ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌ రాణించలేడు.. టీమిండియాకు కష్టాలు తప్పవు: వసీం అక్రమ్‌


Also Read: ప్రేమను నిరాకరించిందని.. ట్రైన్ కింద తోసేసి యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook