ఏసీ, కూలర్లు ఎక్కువ వాడడం వల్ల సమస్యలివే..!
చాలామంది ఇరవై నాలుగు గంటలూ ఏసీలోనే గడిపి ఉపశమనాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు కూలర్ల మీద ఆధారపడతారు. అయితే ఇంటి వాతావరణాన్ని చల్లబరిచే ఈ ఎయిర్ కండీషన్ సెట్లు, కూలర్లు వాడడం నిజంగానే మన ఆరోగ్యానికి మంచిదా..? అనే సందేహం కూడా కలగకమానదు
చాలామంది ఇరవై నాలుగు గంటలూ ఏసీలోనే గడిపి ఉపశమనాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు కూలర్ల మీద ఆధారపడతారు. అయితే ఇంటి వాతావరణాన్ని చల్లబరిచే ఈ ఎయిర్ కండీషన్ సెట్లు, కూలర్లు వాడడం నిజంగానే మన ఆరోగ్యానికి మంచిదా..? అనే సందేహం కూడా కలగకమానదు. అయితే ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల పలు శారీరక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు పలువురు వైద్యనిపుణులు. అవేంటో మనం కూడా చూద్దాం..!
*ఎక్కువ సేపు ఎయిర్ కండీషన్డ్ వాతావరణానికి అలవాటు పడడం వల్ల... శరీరం కేవలం ఒక స్థాయి వాతావరణానికే సహకరించే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు తీవ్రమైన ఒత్తిడికి కూడా గురై గుండెపై, శ్వాసకోశంపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.
*అలాగే ఎక్కువసేపు శీతల ప్రదేశంలో కూర్చొని పనిచేస్తే గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
*అలాగే ఏసీలో ఎక్కువసేపు కూర్చుంటే చర్మం పొడిబారిపోతుంది.
*ముఖ్యంగా తలుపులు మూసివేసి, సెంట్రలైజ్డ్ ఏసీలో పనిచేయడం వల్ల ఎలర్జీల బారిన పడే అవకాశం కూడా ఉంది. విపరీతమైన తలనొప్పి, కళ్ల దురద రావడం, న్యూమోనియో బారిన పడడం లాంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
*బీపీ ఉన్నవారు సాధ్యమైనంత వరకు ఏసీ వాతావరణంలో పనిచేయకపోవడమే మంచిది. ముఖ్యంగా గాలి బయటకు వెళ్లదు కాబట్టి.. అనుకోని సందర్భాల్లో రక్తపోటు కూడా పెరుగుతుంది.
అందుకే ఎవరైనా ఏసీ వాడినా.. సాధారణ గది ఉష్ణోగ్రతను కచ్చితంగా పాటించాల్సిందే. మొత్తం రోజంతా ఏసీలో గడపకుండా.. అవసరమైనప్పుడు మాత్రమే ఏసీలో వేసవి తాపాన్ని తీర్చుకోవాలి. అలాగే కూలర్లను కూడా అవసరం మేరకే వాడాలి.