ఆయన్ను సీఎంగా చూడాలని ఉంది: మోహన్ బాబు
ఆయన్ను సీఎంగా చూడాలని ఉంది: మోహన్ బాబు
డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఎం మోహన్ బాబు అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభ ఆదివారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
'కోయంబత్తూరులో జరిగిన కరుణానిధి సంస్మరణ సభకు నన్నుఆహ్వానించినందుకు, సోదరుడు ఎంకే స్టాలిన్‌కు ధన్యవాదాలు' అని ట్విట్టర్‌లో మోహన్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఆయన.. ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ట్వీట్‌తో పాటు స్టాలిన్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా మోహన్ బాబు షేర్ చేశారు. ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కరుణానిధి, ఆయన కుటుంబంతో మోహన్ బాబుకు మంచి స్నేహం ఉంది. తమిళనాడులో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నప్పటి నుంచి వారిద్దరి మధ్య పరిచయం ఉంది. కొన్ని సందర్భాల్లో మోహన్ బాబు సినిమా కార్యక్రమాలకు కూడా కరుణానిధి హాజరయ్యారు.