iBOMMA Shock to its Indian Users: తెలుగు సినీ ప్రేమికులకు ‘ఐ బొమ్మ’(ibomma) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓటీటీలో రిలీజ్ అయిన హై క్వాలిటీ సినిమాలను ఫ్రీగా అందించే ఐ బొమ్మ అనే వెబ్సైట్ దాదాపు అందరికీ పరిచయమే. అయితే ఈ ఐ బొమ్మ వెబ్సైట్ నడపడం కష్టంగా ఉందని అయినా సరే తమ మీద దుష్ప్రచారం చేస్తూ ఉండడంతో వెబ్సైట్ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని గతంలో ప్రకటించిన ఐ బొమ్మ తర్వాత ఎందుకో కానీ ఆ విషయంలో వెనక్కి తగ్గింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు ఐ బొమ్మ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేమిటంటే ఇప్పటివరకు ఐ బొమ్మలో దాదాపుగా ఓటీటీ లో విడుదలైన అన్ని సినిమాలు అందుబాటులో ఉండేవి. వెనక్కి వెళ్లి లేదా సెర్చ్ ఆప్షన్ లోకి  మరి మనకు కావాల్సిన సినిమాలు డౌన్లోడ్ చేసుకుని లేదా ఆన్లైన్ లో నేరుగా చూసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇండియన్ యూజర్లు కేవలం వెబ్ సైట్ అప్లోడ్ చేసిన చివరి 30 సినిమాలు మాత్రమే చూడొచ్చని వెబ్సైట్ తమ హోమ్ పేజీలో ప్రకటించింది.


ఇండియన్ యూజర్లు చివరి 30 సినిమాలు మాత్రమే చూడొచ్చు అది కూడా ప్రస్తుతానికి టెంపరరీగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే తమ దగ్గర ఉన్న పూర్తి సినిమాలను చూసే విధంగా ఎప్పటి నుంచి మళ్ళీ అవకాశం కల్పిస్తారు అనే విషయం మీద మాత్రం వెబ్సైట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే గతంలో ఐ బొమ్మలో సెర్చ్ ఆప్షన్ ఉండేది. సెర్చ్ ఆప్షన్ ఉండడంతో ఆయా సినిమాలో పేర్లతో సెర్చ్ చేసుకుని సినిమాలు చూసే అవకాశం కలిగేది. కానీ ఇప్పుడు ఆ సెర్చ్ ఆప్షన్ కూడా కనిపించకుండా డిసేబుల్ చేశారు.


అయితే గతంలో వెబ్సైట్ మూసి వేయడానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్న సమయంలో వెబ్సైట్ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి కానీ మేము ప్యాషన్ తో ఈ పని చేస్తున్నాము అయినా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వ లేదు. దీంతో రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఈ విషయం మీద నేరుగా వెబ్సైట్ వారు క్లారిటీ ఇస్తే కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన వచ్చే అవకాశం కనిపించడం లేదు.


Also Read: Mahesh Babu Trivikram Movie Release: ఆ డేట్లు కాదనుకుని మరీ వెనక్కు.. లాజిక్కేమిటో?


Also Read: LIGER Pre Release Event: లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే.. ఎప్పుడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి