Telangana Politics: బీజేపీకి అవకాశం ఇస్తే రాష్ట్రంలో జరిగే దుర్మార్గాలకు చెక్ పెడతామని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ వచ్చిన తరువాత మహిళా సంఘాలలో కళ లేదన్నారు. నాలుగున్నర ఏళ్లుగా వడ్డీ లేని రుణాలకు ఇవ్వాల్సిన 4500 కోట్ల రూపాయలు బకాయి పెట్టారని విమర్శించారు. బీజేపీకి అవకాశం ఇస్తే.. తాము మొత్తం డబ్బులు  ఇస్తామమని హామీ ఇచ్చారు. 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. గురువారం తుంగతుర్తి నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటల పాల్గొని ప్రసంగించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. మర్డర్లు జరుగుతున్నాయి అని ఇక్కడికి రాగానే కార్యకర్తలు నాకు చెప్పారు. ఇది ఒక తుంగతుర్తికే పరిమితం కాదు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది. దీనికి పరిష్కారం చెప్పే బాధ్యత బీజేపీ కార్యకర్తల చేతుల్లో ఉంది. ఇక్కడ యువకుల ఉత్సాహం, ఆక్రోషం చూస్తుంటే కేసీఆర్ పార్టీని బొంద పెడతారని విశ్వాసం ఉంది. మీరే కథానాయకులుగా ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాలను తెలియచెప్పాలి. తుంగతుర్తి గడ్డ మీద ఎగిరేది కాషాయ జెండానే..


కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి పంటకు 9 వేల చొప్పున 18 వేల రూపాయలు అందిస్తున్నారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చేది 10 వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 18 వేల రూపాయలు. రైతుబంధు పేరు చెప్పి అన్ని సబ్సిడీలను కేసీఆర్ ఎత్తివేశారు. వందల ఎకరాల ఉన్నవారికి రైతుబంధు బీజేపీ వచ్చిన తరువాత ఇవ్వం. కౌలు రైతులను ఆదుకుంటాం. భార్యాభర్తలు ఇద్దరికీ వృద్ధాప్య పింఛన్ అందిస్తాం. కేసీఆర్ ఇచ్చే పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప నిజమైన అర్హులకు ఇవ్వడం లేదు. దళితబంధు వారి నాయకులకే ఇచ్చుకుంటున్నారు." అని ఈటల రాజేందర్ అన్నారు. 
 
అంతకుముందు నిరుద్యోగులకు అండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో బీజేపీ పోరాడుతోందన్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా హక్కులను కాలరాస్తోందని.. కేంద్రమంత్రి అని కూడా చూడకుండా కిషన్ రెడ్డిపై జుగుప్సాకరంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. 


Also Read: Jawan OTT Release Update: దిమ్మతిరిగే రేటుకు జవాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?  


Also Read: Nipah Virus Latest Updates: ముంచుకొస్తున్న నిపా వైరస్ ముప్పు.. మరో ఇద్దరు మృతి.. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook