IMDb Top Actors in India, Dhanush top in IMDbs Most Popular Indian Stars 2022 List: 2022 చివరికి వచ్చేసింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి సంబంధించి మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ జాబితాను ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDb) విడుదల చేసింది. ఐఎండీబీ అత్యంత ప్రజాదరణ పొందిన 2022 భారతీయ తారలలో వివిధ సినీ పరిశ్రమలకు చెందిన స్టార్‌లు ఉన్నారు. ఈ జాబితాలో తమిళ స్టార్ హీరో ధనుష్‌ అగ్ర స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా సినీ ప్రియుల అభిప్రాయాలను ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసినట్లు ఐఎండీబీ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుష్‌ ఉత్తమ నటుడిగా భారతదేశంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో నానే వరువెన్, వాతి, తిరు చిత్రాలతో మంచి విజయాలు ఖాతాలో వేసుకునాన్రు. మరోవైపు ధనుష్‌ ఈఏడాది హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. హాలీవుడ్‌ సినిమా ‘ది గ్రే మ్యాన్‌’లో ఆయన కీలక పాత్ర పోషించారు. జులైలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఐఎండీబీ రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌, అందాల తార ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ ఉన్నారు. 


ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ తేజ్ మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సినిమాలో చరణ్‌ రామరాజు పాత్రలో సత్తాచాటారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత ఐదో స్థానంలో నిలిచారు. బాలీవుడ్ స్టార్స్ హృతిక్‌ రోషన్‌, కియారా అడ్వాణీ 6,7 స్థానాల్లో ఉన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప, కేజీయఫ్‌ సినిమాలతో యశ్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతంచేసుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, యశ్‌ టాప్ 10లో చోటు సంపాదించారు. 



ఐఎండీబీ టాప్ 10 జాబితా ఇదే:
1. ధనుష్‌
2. అలియా భట్‌
3. ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌
4. రామ్‌చరణ్‌
5. సమంత
6. హృతిక్‌ రోషన్‌
7. కియారా అడ్వాణీ
8. ఎన్టీఆర్‌
9. అల్లు అర్జున్‌
10. యశ్‌


Also Read: Waltair Veerayya Release Date: ఇట్స్ అఫీషియల్.. సంక్రాంతికే 'వాల్తేరు వీరయ్య'! పోస్టర్ వైరల్‌  


Also Read: CM KCR: కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు.. 5-10 రోజుల్లో రైతుబంధు డబ్బు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.