దేశమును ప్రేమించుమన్నా.. మంచియన్నది పెంచుమన్నా అన్నారు మహాకవి గురజాడ. మన దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులెందరో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారు. బ్రిటీష్ వారి అరాచక పాలన నుండి భారతీయులను విముక్తి గావించడానికి అహర్నిశలు కష్టపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా దేశ రక్షణ కోసం తాము చేస్తున్న విధుల్లో భాగంగా ఎందరో సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారి గాధలు మనందరికీ ఆదర్శప్రాయం కావాలి. వారి బాటలోనే మనం నడవడానికి ప్రయత్నించాలి. "భారత స్వాతంత్ర్య సంగ్రామం" చరిత్రపుటలకెక్కిన ఓ గొప్ప మహా అధ్యాయం. తెలుగు సినిమాల్లో కూడా ఇప్పటికి అనేకమంది దర్శకులు ఎన్నో దేశభక్తి చిత్రాలను తీయడం జరిగింది. వాటన్నింటికీ ప్రజలు నీరాజనం పలికారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అటువంటి దేశభక్తి చిత్రాల గురించి ఈ వ్యాసం మీకోసం ప్రత్యేకం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"172872","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అల్లూరి సీతారామరాజు: సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం 1974లో విడుదలైన విశేష ప్రేక్షకాదరణను పొందింది. అమరవీరుడు అల్లూరి జీవితకథను ఆధారంగా చేసుకొని తీసిన ఈ చిత్రంలో మన్నెంలో బ్రిటీష్ తొత్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి విప్లవవీరుడు సీతారామరాజు ఎలాంటి సంగ్రామం చేశారో.. ఎలా అసువులు బాసారో ఈ సినిమాలో చూపించడం జరిగింది. తెలుగు నాట వచ్చిన దేశభక్తి చిత్రాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయాన్ని ఈ చిత్రం కైవసం చేసుకుంది. వి.రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రిపురనేని మహారథి రచనా సహకారం అందించగా.. పాటలను మహాకవి శ్రీశ్రీ రాశారు. తెలుగు వీర లేవరా.. లాంటి సూపర్ హిట్ గీతం ఈ చిత్రంలోనిదే.


[[{"fid":"172873","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఆంధ్ర కేసరి: ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా "ఆంధ్రకేసరి". విజయ్ చందర్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. ఆయనే ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.  1983లో విడుదలైన ఈ చిత్రం నంది పురస్కారాన్ని కూడా కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ చిత్ర నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయడం విశేషం. దాదాపు అప్పట్లోనే 18 లక్షల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. 


[[{"fid":"172874","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


డాక్టర్ అంబేద్కర్ - 1990 సంవత్సరంలో భరత్ పారేపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే "డాక్టర్ అంబేద్కర్". ఆకాష్ ఖురానా ఈ చిత్రంలో అంబేద్కర్ పాత్ర పోషించారు. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా ఈ సినిమా నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది. సి.నారాయణరెడ్డి ఈ చిత్రంలోని పాటలు రాశారు. 


[[{"fid":"172875","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


వందేమాతరం: 1985లో దర్శకుడు టి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన దేశభక్తి చిత్రం "వందేమాతరం". అవినీతిపరులను ఎదుర్కోవడానికి సామాన్య ప్రజలు కూడా నడుం బిగించాల్సి ఉందని.. అదే అసలైన దేశభక్తి అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంతోనే సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలోని "వందేమాతరం" టైటిల్ సాంగ్ అప్పటికే ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో బాగా పాపులర్ అయ్యింది. డాక్టర్ రాజశేఖర్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. 


[[{"fid":"172876","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


భారత రత్న: 1999లో విజయశాంతి ప్రధాన పాత్రలో కోడి రామక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "భారత రత్న". ఓ ఆర్మీ మేజర్‌గా సరిహద్దు ప్రాంతాల్లో ముష్కరులు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసే ఓ సాహసికురాలి కథే "భారత రత్న". పోసాని క్రిష్ణమురళి ఈ సినిమాకి కథా సహకారం అందించారు. 


[[{"fid":"172877","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


ఖడ్గం: హిందు, ముస్లిం "భాయి భాయి" అనే సూత్రాన్ని ప్రచారం చేస్తూ.. దేశంలో మత సామరస్యం ఫరిడవిల్లాలని భావించి తీసిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్, రవితేజ, శ్రీకాంత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా ఈ సినిమా సరోజినిదేవి అవార్డును కైవసం చేసుకుంది. 


[[{"fid":"172878","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"7"}}]]


మహాత్మ: మహాత్మ గాంధీ అహింసా సిద్ధాంతాలు ఏ విధంగా ఓ తాగుబోతు యువకుడిని మారుస్తాయో.. అతన్ని రాజకీయాల వైపు అవే సిద్ధాంతాలు ఏ విధంగా  ప్రేరేపిస్తాయన్నది ఈ చిత్ర కథాంశం. 2009లో విడుదలైన ఈ చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన "కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ.. ఊరికొక్క వీధిపేరు కాదుర గాంధీ" అనే పాట ఎంతో పాపులర్ అయ్యింది. 


[[{"fid":"172879","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"8":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"8"}}]]


మేజర్ చంద్రకాంత్: 1993లో నందమూరి తారకరామారావు కథానాయకుడిగా నటించిన దేశభక్తి చిత్రం "మేజర్ చంద్రకాంత్". ఒక రిటైర్డ్ మిలట్రీ ఆఫీసర్ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఏ విధంగా స్పందించి.. అవినీతి పరులైన రాజకీయ నాయకులను ఎదరిస్తారన్నది ఈ చిత్ర కథాంశం. ఇదే చిత్రంలో స్వర్గీయ ఎన్టీఆర్ ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబొమ్మన, సుభాష్ చంద్రబోస్ మొదలైన వారి గెటప్స్‌లో కనిపిస్తారు. కె.రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఎం.మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. 


[[{"fid":"172880","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"9":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"9"}}]]


గగనం: 2011లో వచ్చిన అక్కినేని నాగార్జున నటించిన "గగనం" చిత్రానికి రాధా మోహన్ దర్శకత్వం వహించారు. ఓ భారతీయ విమానాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసినప్పుడు... ఓ ఎన్‌ఎస్‌జీ కమాండర్ ఏ విధంగా ప్రయాణికులను కాపాడతాడన్నది ఈ చిత్రకథ. దేశభక్తిని చాటే ఎన్నో డైలాగ్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఇదే చిత్రం "హిందుస్తాన్ కీ కసమ్" పేరుతో హిందీలో డబ్ చేయబడింది. ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 


[[{"fid":"172881","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"10":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"10"}}]]


సైరా నరసింహారెడ్డి: 2018లో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "సైరా". మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించగా.. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తు్న్నారు.