మహా మల్లయోధుడు రామ్మూర్తి నాయుడు 5 వేలకి పైగా పోటీల్లో ఓటమనేదే ఎరుగని ధీరుడు అనే పేరుంది. ఆయన ప్రతిభ కి అప్పట్లో కింగ్ జార్జ్ స్వయంగా ‘ఇండియన్ హెర్క్యూలెస్’, ‘కలియుగ భీమ’ బిరుదులతో కోడి రామ్మూర్తి నాయుడుని సత్కరించారు. అంతటి మహాబలుడి జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. రానా ఇందులో కోడి రామ్మూర్తిగా నటిస్తున్నట్లు తెలిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డైరక్టర్ ఛాన్స్ ఎవరికి దక్కేను...


కాగాఈ చారిత్రాత్మక యాక్షన్ డ్రామా తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. సౌత్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ తో పాటు ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం కోసం ఒక అగ్ర దర్శకునితో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్అన్ని అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ బయటకొస్తాయి. ఈ సినిమా స్టోరీని ఇప్పటికే రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేయించారు.