మహాభారతానికి.. చెరకుగడకు సంబంధమేమిటి?
మహాభారతాన్నే పంచమవేదం అంటారు. అతి గొప్ప భారతీయ ఇతిహాసమైన మహాభారతమును వేదవ్యాసుడు చెప్పగా విఘ్నేశ్వరుడు రచించాడని ప్రతీతి.
మహాభారతాన్నే పంచమవేదం అంటారు. అతి గొప్ప భారతీయ ఇతిహాసమైన మహాభారతమును వేదవ్యాసుడు చెప్పగా విఘ్నేశ్వరుడు రచించాడని ప్రతీతి. 14వ శతాబ్దంలో తెలుగులో కవిత్రయముగా పేరుగాంచిన నన్నయ, తిక్కన, ఎర్రనలు భారతాన్ని తెలుగులోకి అనువదించారు. "తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి" అనేది చాలా పాత సామెత. మహాభారతాన్నే పౌరాణికులు అష్టాదశపురాణ సారమని అంటూ ఉంటారు. మరి మహాభారతానికి సంబంధించి మనం కూడా పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా..!
*మహాభారతాన్ని రచించడానికి మూడు సంవత్సరాలు పట్టిందని అంటారు
*మన పూర్వీకులు మహాభారతాన్ని చెరకుగడతో పోల్చారు. 18 కణుపులు కలిగిన పెద్ద చెరకుగడ మహాభారతం అంటారు. అంటే 18 పర్వములు కలిగిన మధురమైన కావ్యం మహాభారతం అని అర్థం. చెరకురసంతో నోటికి ఎంత తీపి లభిస్తుందో.. భారతం చదవడం వల్ల అంత గొప్ప జ్ఞానం కలుగుతుందనేది పూర్వీకుల మాట.
*మహాభారతంలో కీలక ఘట్టం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు అని అంటారు. ఒక అక్షౌహిణి అంటే ఒక సైన్య సమూహం అని అర్థం. ఒక్క అక్షౌహిణిలో 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 కాలిబంట్లు ఉంటారనేది లెక్క. ఈ లెక్కను బట్టి కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది పాల్గొన్నారో లెక్క కట్టేయవచ్చు.
*కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశాన్నే శమంతక పంచకం అంటారు. ఈ పంచకం దగ్గరే పరశురాముడు క్షత్రియ వధ చేశాడని అంటారు.