చెన్నై: భారీ అంచనాలతో లైకాప్రొడక్షన్ లో రూపుదిద్దుకొంటోన్న ఇండియన్ 2 చితం షూటింగ్ జరుగుతుండగా సెట్లో ఈ నెల 19న భారీ ప్రమాదం సంభవించగా చిత్ర బృందంలోని ముగ్గురు సాంకేతిక నిపుణులు (సహాయ దర్శకులు) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై మొత్తం తమిళ చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



దాదాపుగా ఒక వారం తరవాత ఇండియన్ 2, చిత్ర దర్శకుడు శంకర్ షణ్ముగం ట్విట్టర్ లో స్పందిస్తూ.. చాలా దుఃఖంతో ట్వీట్ చేస్తున్నాని, ఈ ఘటనలో నా సహాయ దర్శకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉందని, ఆ ప్రమాదమేదో నాకు జరిగి ఉంటే బాగుండేదని ట్వీట్ చేశారు. ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నాని, నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నానంటూ వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని ట్విట్టర్లో పేర్కొన్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..