హైదరాబాద్లో ఇవాంకా ఫస్ట్ ట్వీట్..!
హైదరాబాద్లో ఇవాంకా ఫస్ట్ ట్వీట్..! ఏమి పోస్ట్ చేసిందో తెలుసా?
భాగ్యనగరానికి ఇవాంకా ట్రంప్ చేరుకున్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ట్రైడెంట్ హోటల్ కు వెళ్లారు. ఉదయం నాలుగు గంటలకు హోటల్ చేరుకున్న ట్రంప్ కాసేపు విశ్రాంతి తీసుకొని భారత గడ్డ మీద తొలి ట్వీట్ చేశారు.
ఉదయం 10:20 నిమిషాలకు హైదరాబాద్ నుండి ఫస్ట్ ట్వీట్ చేశారు. "అద్భుతమైన స్వాగతానికి ధన్యవాదాలు. హైదరాబాద్ లో ఉన్న నేను ఆతృతగా ఉన్నాను " అని ట్వీట్ లో సంతోషం వ్యక్తంచేశారు. ఇవాంకా ట్వీట్ కు స్పందించిన మోదీ 'వెల్ కమ్ టు ఇండియా' అన్నారు.