త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'అరవింద సమేత వీర రాఘవ'. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ టీజర్‌ను కొద్దిసేపటి క్రితం చిత్రయూనిట్‌ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ టీజర్ లో ఎన్టీఆర్‌ యాక్షన్‌ సీన్స్‌ అభిమానులను కట్టిపడేశాయి. కత్తి పట్టుకోని ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ‘కంటపడ్డావా కనికరిస్తానేమో.. వెంట టపడ్డానా నరికేస్తా ఓబా’ అనే డైలాగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు డైలాగ్స్‌ సైతం ఆకట్టుకుంటున్నాయి.


[[{"fid":"172907","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావడంతో అరవింద సమేత సినిమాపై భారీ అంచనాలున్నాయి.


తారక్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇదే. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఎన్టీఆర్ కనిపిస్తాడట. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను ఎలివేట్ చేసే షాట్స్ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయని మూవీ యూనిట్ చెబుతోంది.


[[{"fid":"172908","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"అరవింద సమేత టీజర్‌లోని దృశ్యాలు","field_file_image_title_text[und][0][value]":"అరవింద సమేత టీజర్‌లోని దృశ్యాలు"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"అరవింద సమేత టీజర్‌లోని దృశ్యాలు","field_file_image_title_text[und][0][value]":"అరవింద సమేత టీజర్‌లోని దృశ్యాలు"}},"link_text":false,"attributes":{"alt":"అరవింద సమేత టీజర్‌లోని దృశ్యాలు","title":"అరవింద సమేత టీజర్‌లోని దృశ్యాలు","class":"media-element file-default","data-delta":"3"}}]]


ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీలక పాత్రల్లో జగపతిబాబు, నాగబాబు తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అక్టోబర్‌లో 'అరవింద సమేత' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.