JR NTR vs Ram Charan: ఆస్కార్ బరిలో రామ్ చరణ్ కంటే ఎన్టీఆరే బెటర్!
JR NTR has more Chances than Ram Charan for Oscar Best Actor Nominations: ఆస్కార్ బెస్ట్ యాక్టర్ నామినేషన్లో రామ్ చరణ్ కూడా నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రమంలో వీరిద్దరిలో ఎవరి నటన బాగుందనే చర్చ జరుగుతోంది.
JR NTR has more Chances than Ram Charan for Oscar Best Actor Nominations: కొన్నాళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు గాను థి బెస్ట్ యాక్టర్ అవార్డుకు గాను జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందంటూ వెరైటీ అనే ఒక మ్యాగజైన్ లో ఒక లిస్ట్ ప్రచురితం కావడం అందరికీ గుర్తుండే ఉంటుంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎత్తున ఆస్కార్ బరిలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. వాస్తవానికి వెరైటీ అనే ఒక మ్యాగజైన్ ఎంటర్టైన్మెంట్ వార్తలు అందిస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉన్న సినిమాలు జాబితాలో ఆర్ఆర్ఆర్ నుంచి నటుల జాబితాలో ఎన్టీఆర్ పేరు ప్రచురించింది. అదే జాబితాలో ఎన్టీఆర్ తర్వాత స్థానంలో రామ్ చరణ్ కు స్థానం కల్పించింది. అదే జాబితాలో ఎన్టీఆర్ కు స్థానం కల్పించినప్పుడు రాంచరణ్ కు ఎందుకు స్థానం కల్పించలేదు అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఇద్దరికీ ఆస్కార్ బరిలో నామినేట్ అయ్యే అవకాశం ఉందంటూ ఒక లిస్టు ప్రచురించడం ఆసక్తికరంగా మారింది.
రామ్ చరణ్ అభిమానులు తమ అభిమాన హీరో పేరు ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు లిస్టులో ప్రచురించడంతో పండగ చేసుకుంటున్నారు . అయితే ఇతర హీరోల అభిమానులు అలాగే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఇదేదో తేడాగా ఉందే, ఎందుకంటే నిజంగా రామ్ చరణ్ కు ఆ సత్తానే ఉంటే ఎన్టీఆర్ పేరు ఎంటర్ చేసినప్పుడే ఆయన పేరు కూడా ఎంటర్ చేసేవారు కదా, అలాంటిది అప్పుడు చేయకుండా ఇప్పుడు రామ్ చరణ్ పేరు తెరమీదకు తీసుకురావడం అనేది ఎందుకు అనేది కాస్త అనుమానాస్పదంగానే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ విషయం మీద వివాదాస్పద క్రిటిక్ ఉమైర్ సంధు స్పందిస్తూ ‘’ఎన్టీఆర్ రామ్ చరణ్ కంటే ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్టీఆర్ పేరే జ్యూరీ తీసుకోవాలని భావిస్తోంది ఎన్టీఆర్ కి ఆస్కార్ ఇవ్వాలని అంటూ ఆయన ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఆర్ఆర్ఆర్ విషయంలో బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి పేరు బెస్ట్ యాక్టర్స్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలింగా ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచింది.
అలాగే బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లేగా ఆర్ఆర్ఆర్ సినిమా, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా దోస్తీ సాంగ్ నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వైరైటీ మ్యాగజైన్ పేర్కొంది. అయితే ఈ లిస్ట్ పైన పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఆర్ఆర్ఆర్ సినిమాని సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. వీరి సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ నటించారు. శ్రియా శరన్ అజయ్ దేవగన్ వంటి వారు ఇతర కీలకపాత్రలో నటించారు.
Also Read: AAGMC Vs NMBKV vs Saakini Daakini: సత్తా చాటిన కిరణ్ అబ్బవరం సినిమా.. మిగతా వాటి పరిస్థితి ఏమిటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి