Osey Arundhathi: `ఒసేయ్ అరుంధతి` సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన లిరిక్స్
Osey Arundhathi Title Song: ఒసేయ్ అరుంధతి మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో లిరిక్స్ క్యాచీగా ఉండగా.. రాహుల్ సిప్లిగంజ్ చక్కగా పాడాడు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Osey Arundhathi Title Song: ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో విక్రాంత్ కుమార్ డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ 'ఒసేయ్ అరుంధతి'. మోనికా చౌహాన్, కమల్ కామరాజు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గూడురు ప్రణయ్ రెడ్డి నిర్మించారు. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను షురు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ టైటిల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
Also Read: Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌పై బిగ్ అప్‌డేట్.. ఆ రోజే ఫలితాలు..!
ఈ సాంగ్‌ను దర్శకుడు విక్రాంత్ కుమార్ రాశారు. సునీల్ కశ్యప్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడగా.. లిరిక్స్ క్యాచీగా ఉండడంతో ఆడియన్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్ రిలీజ్ సందర్భంగా ప్రొడ్యూసర్ గూడూరు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ.. ఒసేయ్ అరుంధతి అంటూ సాగే టైటిల్ ట్రాక్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. సినిమా షూటింగ్ పూర్తయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. సినిమా చాలా చక్కగా వచ్చిందని.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో సినిమాను నిర్మించడం సంతోషంగా ఉందన్నారు.
అనంతరం డైరెక్టర్ విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌లోని మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన మహిళ అరుంధతి.. పిల్లాడితోపాటు ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఆమె సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని నిర్ణయించుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నుంచి తన ఇంటిని ఎలా రక్షించుకుంది..? తనను ఎలా కాపాడుకుంటూ.. తన ఇంటి పరువును ఎలా నిలబెట్టింది..? అనే కాన్సెప్ట్‌తో ఒసేయ్ అరుంధతి సినిమాను రూపొందించాం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తోపాటు కామెడీతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సమేతంగా చూసేలా తెరకెక్కించాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువస్తాం..' అని తెలిపారు.
పృథ్వీరాజ్, చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్, టార్జాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫర్‌గా సాయి చైతన్య మాటేటి పనిచేయగా.. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించారు. ఎడిటర్‌గా మార్తాండ్ కె.వెంకటేష్ వర్క్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook