న్యూఢిల్లీ: 41 ఏళ్ల బేబీడోల్ సింగర్ కనికాకపూర్ ప్రస్తుతం సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జిపిజిమ్స్) లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కనికా కపూర్ వరుసగా ఐదోసారి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: కరోనా అందుకే ఎక్కువ వ్యాపించింది: చంద్రబాబు


మెడికల్ నియమ నిబంధనల ప్రకారం ప్రతి 48 గంటలకు ఒకసారి పరీక్షించబడతారని, పూర్తి స్థాయి ఫలితం రావాలంటే రెండు రోజుల వ్యవధి పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఐదు సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతికూలమైన ఫలితమే వచ్చిందని అన్నారు. అయితే మరోవైపు కనికా కపూర్ ఆరోగ్య పరిస్థితిపై  ప్రొఫెసర్ ఆర్.కె. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ధీమాన్ కపూర్ స్పందిస్తూ.. పరిస్థితి స్థిరంగా ఉందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. 

 


Read also : 3.2 లక్షల మంది కరోనా రోగుల కోసం 20,000 బోగీలతో ఐసోలేషన్ వార్డులు


 గాయని ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో పలురకాల స్పందనలు వినిపిస్తున్న నేపథ్యంలో ‘చిట్టియాన్ కలైయాన్’ గాయని ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. ఆమె ‘బాగుందని కనికా అభిమానులకు భరోసా ఇచ్చారు. ఐసీయూలో ఉన్నారన్న పుకార్లను తోసిపుచ్చారు.  
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..


Read also : Corona cases in AP: ఏపీలో మరో 17 కరోనా కేసులు