Susheel Gowda suicide: కన్నడ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య..
కన్నడ నటుడిగా పేరుప్రఖ్యాతులను సంపాదించుకున్న సుశీల్ గౌడ ఆత్మహత్య పాల్పడ్డాడు. కర్ణాటకలోని మండ్యలో ఆయన బలవన్మరణానికి పాల్పడగా, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
హైదరాబాద్: కన్నడ నటుడిగా పేరుప్రఖ్యాతులను సంపాదించుకున్న సుశీల్ గౌడ ఆత్మహత్య పాల్పడ్డాడు. కర్ణాటకలోని మండ్యలో ఆయన బలవన్మరణానికి పాల్పడగా, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కన్నడ సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ నటుడిగా పేరుతెచ్చుకున్న సుశీల్ నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. తాజాగా సుశీల్, హీరో దునియా విజయ్ నటించిన చిత్రంలో పోలీసు పాత్రలో నటించాడు. అయితే, ఆ చిత్రం ఇంకా విడుదల కాకముందే ఆత్మహత్యకు పాల్పడటం అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది.
Also Read: Prabhas 20: ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల తేదీ తెలిసింది
మరోవైపు సుశీల్ ఆత్మహత్యపై దునియా విజయ్ స్పందిస్తూ.. సుశీల్ ను తొలిసారి చూసినప్పుడు హీరో కావాల్సిన వ్యక్తి అని అనుకున్నానని చెప్పారు. సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటాడని భావించానని, కానీ అందరినీ వదిలి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య సమాధానం కాదని, కష్ట సమయంలో అందరూ ధైర్యంగా ఉండాలని, పోరాడి సాధించాలని అన్నారు.
Also Read: Free Cylinder Ujjwala Yojana: మరో మూడు నెలలు ఉచిత సిలిండర్లు
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..