రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రం ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా చూసిన ప్రముఖ చిత్ర విమర్శకులు కత్తి మహేష్ పలు ఆస్తకికరమైన కామెంట్స్ చేశారు. ఈ సినిమా తనకు అంత చెప్పుకోదగ్గ స్థాయి అనిపించలేదని చెప్పారు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోరు, సినిమాటోగ్రఫీ మాత్రం ఈ సినిమాలో చాలా బాగున్నాయని ఆయన అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినప్పటికీ కథ మూసధోరణిలో సాగుతుందని తెలిపారు. సినిమా గ్రామీణ  నేపథ్యంలో తెరకెక్కినా.. మనసుకు హత్తుకొనే విధంగా తీయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని కత్తి మహేష్ విమర్శలు గుప్పించారు. సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ బాగా అందించాడని.. అయితే పలు పాటలను తానే పాడడంతో అవి అంతగానే ఆకట్టుకోలేదని తెలిపారు. 


అలాగే దర్శకులు సుకుమార్ పై కూడా కత్తి మహేష్ పలు విమర్శలు చేశారు. దర్శకత్వం బాగానే చేసినప్పటికీ.. కథ, కథనాలలో లోపాలకు కూడా దర్శకుడే బాధ్యత వహించాలని కత్తి మహేష్ తేల్చి చెప్పారు. అలాగే సినిమా వాయిస్ ఓవరుతో ఎందుకు ప్రారంభించారో కూడా తనకు అర్థం కాలేదని.. ఈ మధ్యకాలంలో ప్రతీ సినిమాకి సమయం సందర్భం లేకుండా వాయిస్ ఓవర్లు ఇవ్వడం చేస్తున్నారని కత్తి మహేష్ అన్నారు.


అసలు 80వ దశకంలో కథను సెట్ చేసుకున్నప్పుడు.. దానికి సంబంధించిన బలమైన కారణం కూడా చూపించాల్సి ఉంటుందని.. కాకపోతే ఆ కారణాన్ని చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారని కత్తి మహేష్ అన్నారు.