ఇంటర్నెట్‌ని హీటెక్కించనున్న కత్రినా కైఫ్ పాట!
జీరో సినిమా నుంచి కత్రినా కైఫ్ పాట టీజర్ విడుదల
షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కా శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జీరో సినిమా ఈ డిసెంబర్ 21న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టిన చిత్ర నిర్మాతలు తాజాగా కత్రినా కైఫ్ స్టెప్పేసిన హస్న్ పర్చుం పాట టీజర్‌ను విడుదల చేశారు. డిసెంబర్ 12న మొత్తం పాటను విడుదల చేస్తామని మేకర్స్ ఈ టీజర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాలో బబిత కుమారి అనే హీరోయిన్ పాత్రలో నటించిన కత్రినా కైఫ్.. ఈ పాటతో ఆడియెన్స్ మతులు పోగొట్టడం ఖాయం అని చెబుతోంది మూవీ యూనిట్. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను షారుఖ్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు.