Kia Cars Price 2023: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
Kia Cars Price 2023: దేశంలో ఇటీవల ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. కారు కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లతో ఎస్‌యూవీ లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ కొరియన్ కంపెనీ కియా మోటార్స్ సైతం ఇప్పుడు అప్‌డేటెడ్ ఎస్‌యూవీ లాంచ్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Kia Cars Price 2023: మొన్నటి వరకూ సెడాన్ కార్లంటే క్రేజ్. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎస్‌యూవీ కార్లకు ఆదరణ పెరిగింది. ఖర్చు కంటే సౌకర్యానికి ప్రాధాన్యత పెరగడమే ఇందుకు కారణం. కంపెనీలు కూడా ఎస్‌యూవీల్లో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఫీచర్లు అందిస్తున్నాయి. కియా మోటార్స్ కంపెనీ ఎస్‌యూవీ ఇప్పుడు మార్కెట్‌లో ఆసక్తి రేపుతోంది.
కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ కియా మోటార్స్ ఏపీలో యూనిట్ స్థాపించి చాలాకాలమైంది. అప్పట్నించి దేశంలోని రోడ్లపై కియా కార్లు సందడి చేస్తున్నాయి. ఫీచర్ల పరంగా కియా కార్లను తలదన్నేటివి లేవనే చెప్పాలి. ఇప్పుడు రెండు ఎస్‌యూవీలను అప్‌డేట్ చేసి భారతీయ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ రెండు ఎస్‌యూవీల్లో ఒకటి జూలైలో లాంచ్ కానుంది. ఎస్‌యూవీ మార్కెట్‌లో అగ్రగణ్యులుగా ఉన్న హ్యుండయ్ క్రెటాతో పోటీ పడనుంది. ఇక రెండవ ఎస్‌యూవీ మారుతి బ్రెజాతో పోటీ పడుతుంది. సౌకర్యాలపరంగా మొదటి ఎస్‌యూవీ ఉంటే, 4 మీటర్ కంఫర్ట్ ఎస్‌యూవీలో రెండవది నిలుస్తుంది.
కియా మోటార్స్ కార్ల గురించి చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది కియా సెల్టోస్. బాగా ఆదరణ పొందిన కారు ఇది. కియా మోటార్స్ కంపెనీ ఇప్పుడు కియో సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రవేశపెట్టనుంది. కియా సెల్టోస్ కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో టైగర్ నోస్ గ్రిల్, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉంటాయి. న్యూ కియా సెల్టోస్ ఇంటీరియర్ అంతా కొత్తగా ఉంటుంది. ఇందులో ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్ , ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం కనెక్టెడ్ యూనిట్ ఉంటుంది. ఇక డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ కూడా కొత్తదే. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఉంటుంది. దీంతోపాటు కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. కియా క్యారెన్స్ ఎంపీవీలో ఉపయోగించే టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది హ్యుండయ్ క్రెటాతో పోటీ పడనుంది.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కూడా లాంచ్ కానుంది. కియా మోటార్స్ ఇప్పుడు సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో పనిచేస్తుంది. ఇప్పటికే ఈ కారు టెస్చింగ్ ఇండియాలో పూర్తయింది. అప్‌డేటెడ్ మోడల్ డిజైన్‌లో కూడా మార్పు ఉంటుంది. ఇంటీరియర్ పూర్తిగా మారుతుంది. దాంతోపాటు కొత్త ఫీచర్లు జోడించారు. ముఖ్యంగా కొత్త సెల్టోస్‌లో ఉన్నట్టు విభిన్నంగా ఉంటుంది. ఇందులో ఇప్పుడున్న ఇంజన్ ఆప్షన్లే కొనసాగనున్నాయి. 1.2 లీటర్ ఎన్ఏ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఉన్నాయి. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ జూలైలో లాంచ్ కానుండగా, కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడనేది ఇంకా తెలియలేదు. కచ్చితంగా ఈ కారు మారుతి బ్రెజాతో పోటీ పడనుంది.
Also read: PAN-Aadhaar Link: ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేశారా..? సింపుల్‌గా ఇలా చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook