బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 (Bigg Boss Telugu 4) మరింత ఆసక్తికరంగా మారుతోంది. కీలకమైన గ్రాండ్ ఫినాలే చేరడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే విషయంపై బిగ్‌బాస్ తెలుగు ప్రేక్షకులతో పాటు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు బిగ్‌బాస్ ప్రేక్షకులు. ఈ క్రమంలో మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిరకే బిగ్‌బాస్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఓ ఎపిసోడ్‌లో ఇద్దరు హోస్ట్‌లు నాగార్జున, కమల్ హాసన్ కనిపించి కంటెస్టెంట్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. కమల్ హాసన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మరో బిగ్‌బాస్ హోస్ట్ తెలుగు బిగ్‌బాస్ 4 (Bigg Boss 4 Telugu) కంటెస్టెంట్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కన్నడ బిగ్‌బాస్ షోను విజయవంతంగా ముందుకు కొనసాగేలా చేస్తున్న స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) బిగ్‌బాస్ తెలుగు 4కు ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు. దీంతో తెలుగు, కన్నడ బిగ్‌బాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.   Also Read : Bigg Boss Telugu 4: కంటెస్టెంట్ Monal Gajjar ప్రతి వారం ఎలా సేవ్ అవుతుందో తెలుసా?


[[{"fid":"199795","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Pic Courtesy: Facebook","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Pic Courtesy: Facebook","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Pic Courtesy: Facebook","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]


 


టాప్‌లో ఆమె.. తక్కువ ఓట్లు అతడికే
అయితే లక్కీగా గ్రీన్ క్యాప్ దక్కించుకున్న మొనాల్ గజ్జర్ తొలుత నామినేషన్ నుంచి సేవ్ అయింది. కానీ కెప్టెన్ హారికకు ప్రత్యేక అధికారం ఇవ్వడంతో ఆమె అభిజిత్‌ను సేవ్ చేసి మొనాల్‌ను డేంజర్ జోన్‌కు పండంతో సానుభూతి ఓట్లు బాగా పడ్డాయి. ఈ వారం ఆమె టాప్‌లో ఉండగా.. తక్కువ ఓట్లు అవినాష్‌కు పడ్డాయని ప్రచారం జరుగుతోంది.


Also Read : Wine Shops Closed: మూడు రోజులపాటు మద్యం షాపులు బంద్


 


కిచ్చా సుదీప్ ప్రత్యేక అతిథిగా వచ్చాడంటేనే ఈ వారం ఎలిమినేషన్ లేదని అర్థమంటూ బిగ్ బాస్ 4 ప్రేక్షకులు భావిస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ వారం అందరూ సేఫ్ అని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా నేటి రాత్రి ఎపిసోడ్‌లో అసలు విషయం తేలనుంది. 


Also Read : Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook