King Cobras build a nest for eggs: ఈ భూ ప్రపంచంలో ఉండే ఎన్నో రకాల పక్షులు చెట్టుపై గూడు కట్టుకుని జీవనం కొనసాగిస్తాయన్న విషయం తెలిసిందే. చిలుక, పావురం, గోరింక, కొంగ, పిచ్చుకలు, గద్ద, కాకి.. లాంటి ఎగిరే పక్షులు చెట్లపై గూడు కట్టుకుంటాయి. ఇందులో పెద్ద వింతేమీ లేదు. అయితే పాములు గూడు నిర్మించుకోవడం మాత్రం ఆచర్యమే అని చెప్పాలి. పుట్టలలో, అడవుల్లో ఉండే పాములు గూడు కట్టుకోవడం ఏంటని అనుకుంటున్నారా?. మీరు చూస్తుంది నిజమే.. కింగ్ కోబ్రాలు గూడు కట్టుకుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ భూమ్మీద ప్రతి జంతువుకు ఓ మేటింగ్ సీజన్ ఉంటుంది. ఈ క్రమంలోనే పాములకు కూడా సంవత్సరంలో మూడు నెలల మేటింగ్ సీజన్ ఉంటుంది. మేటింగ్ సీజన్‌ అనంతరం కొన్ని జాతుల పాములు గుడ్లను పెడుతాయి. ఫిమేల్ కింగ్ కోబ్రా కూడా గుడ్లను పెడుతుంది. అయితే గుడ్లు పెట్టేందుకు కింగ్ కోబ్రా గూడు కట్టుకుంటుంది. పాము జాతులలో కింగ్ కోబ్రా మాత్రమే గూడు కట్టుకుంటుందట. పక్షుల మాదిరి చెట్లపై కాకుండా.. భూమి మీదే కింగ్ కోబ్రా గూడు కడుతుంది. 


కింగ్ కోబ్రా తన గూడు కోసం ముందుగా సరైన ప్రాంతాన్ని వెతుకుందట. ఎక్కువగా చెట్ల పక్కన ఉండే పల్లపు ప్రాంతాలను ఎంచుకుంటాయట. కింగ్ కోబ్రా చెట్టు ఆకులు, అలములతోనే భూమ్మీద గూడు కడుతుంది. ఆకులు భారీగా ఉన్న చోట పాము తన శరీరంతో గూడు నిర్మించుకుంటుంది. ఇందుకోసం అది 7 నుంచి 14 రోజులు కష్టపడుతుందట. కింగ్ కోబ్రా తన గూడుపై సూర్య రష్మి ఎక్కువగా పడకుండా అది జాగ్రత్త పడుతుందట. అదే సమయంలో నీరు లోపలి రాకుండా చూసుకుంటుంది. వర్షాకాలంలో కూడా లోపలి నీరు రాకుండా ఆకులతో దట్టంగా గూడు నిర్మించుకుందట. 



కింగ్ కోబ్రా గూడు మొత్తం ఆకులతోనే ఉంటుంది. కింగ్ కోబ్రా గూడు దాదాపుగా ఒక ఫీట్ ఎత్తు, మూడు ఫీట్ల వెడల్పు ఉంటుంది. కింగ్ కోబ్రా 40 గుడ్ల వరకు పెడుతుందట. గూడు లోపల 80-90 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. గుడ్లు పెట్టడం నుంచి పొదిగే వరకు కింగ్ కోబ్రా గూడులోనే ఉంటుందట. మూడు నెలల పాటు అది గుడులోనే ఉంటుంది. అప్పుడప్పుడు ఆహరం, నీరు కోసం బయటికి వస్తుంది. గుడ్ల నుంచి పిల్లలు బయటికి వచ్చే వరకు కింగ్ కోబ్రా ఎంతో జాగ్రత్తగా ఉంటుందట. ఈ వీడియోను 'Smithsonian Channel' అనే యూట్యూబ్ చేనెల్లో పోస్ట్ చేసారు. ఈ వీడియో చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. 



Also Read: కోహ్లీతో బ్యాటింగ్ చేయడం పెద్ద సమస్య.. మీడియాతో సూర్యకుమార్‌ ఏం చెప్పాడంటే?


Also Read: 141 బంతుల్లో 277 పరుగులు.. రోహిత్‌ శర్మ, కుమార సంగక్కర రికార్డు బ్రేక్‌! కొట్టింది మనోడే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook