King Cobra with Hood: యూట్యూబ్‌లో ఎన్నో షార్ట్ వీడియోస్ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే షార్ట్స్ ఉండేవి కొన్ని సెకన్ల నిడివే అయినప్పటికీ.. అందులో భారీ సంఖ్యలో జనాన్ని ఎట్రాక్ట్ చేసే అంశాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. బోర్ కొట్టకుండా కొన్ని సెకన్ల పాటే ఉండే ఈ వీడియోలు చూసినప్పుడు ..  అరెరె అప్పుడే అయిపోయిందా.. ఇంకాసేపు ఉంటే బాగుండేదే అని అనిపించకమానదు. షార్ట్స్ వీడియోలకు ఉండే గొప్పతనం అదే. అందువల్లే అవి అంత భారీగా వైరల్ అవుతుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్నెట్లో వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియాలు ఉండటం మీరు కూడా చూసే ఉంటారు. అందులోనూ రెగ్యులర్ వీడియోలు కాకుండా పెద్ద పెద్ద పాములు, లేదా పడగ విప్పిన పాములు, నాగిని డాన్స్ చేసే భారీ సర్పాలు, ఇంట్లోకి దూరిన పాములను స్నేక్ క్యాచర్స్ పట్టడం వంటి వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలకు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంటుంది. 


నాగుపాము పడగ విప్పిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఒకరినొకరు షేర్ చేసుకుంటుంటారు. ఎందుకంటే.. సహజంగానే మనిషి అలాంటి వీడియోలకు ఎక్కువగా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంటాడు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. మామూలుగానే నాగు పాములను దైవంగా భావించి పూజించడం జరుగుతుంటుంది. నాగు పామును చూస్తే చాలు భయపడి పరుగెత్తే వాళ్లు కొంత మంది ఉంటే.. అదే నాగు పాముకు రెండు చేతులెత్తి దండం పెట్టుకునే వాళ్లు కూడా ఉంటారు. పడగ విప్పిన నాగుపామును చూడటంతోనే నాగదేవతను చూశామనో లేక శివుడిని చూశామ అని అనుకునే వారి సంఖ్యకు కూడా కొదువే లేదు. 


Also Read: King Cobra Viral Video: పెద్ద నాగు పాముకు నీళ్లు తాగించాడు.. ఆడు మగాడ్రా బుజ్జి..



పడగవిప్పి నిటారుగా నిలబడిన నాగు పాము వీడియో


ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో కూడా ఒక పెద్ద నాగు పాము ముళ్ల చెట్టుపై నిలబడి పడగ విప్పడం చూడొచ్చు. ఎత్తులో ఒక ముళ్ల కంప చెట్టుపై పడగ విప్పి మరీ నిలబడిన ఈ నాగుపాము వీడియోను ఎప్పడు, ఎవ్వరు, ఎక్కడ, ఎలా షూట్ చేశారో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.


Also Read: Trending video: వాటర్ బాటిల్ తో ఉడుత దాహం తీర్చిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి