Rules Ranjan: కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ సినిమా రివ్యూ
విభిన్నమైన కథనాలతో వచ్చే సినిమా ఎపుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. కిరణ్ అబ్బవరం తీసిన సినిమాలు తక్కువే అయిన మంచి కథ ఉన్న సినిమాలు ఎందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కిరణ్ నటించిన రూల్స్ రంజన్ సినిమా ఎలా ఉందంటే..?
చిత్రం: రూల్స్ రంజన్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్ వెన్నెల కిశోర్, ఆది, సుదర్శన్, అజయ్, సుబ్బరాజు, మక్రంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ తదితరులు
నిర్మాణ సంస్థ: స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్
రచన, దర్శకుడు: రత్న కృష్ణ
నిర్మాత: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
సినిమాటోగ్రాఫర్: దులీప్ కుమార్ ఎం.ఎస్
భిన్నమైన కథనాలతో వచ్చే సినిమామలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అలా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు దగ్గరైన హీరో కిరణ్ అబ్బవరం. 'రాజావారు రాణిగారు' సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన కిరణ్ అబ్బవరం.. ఎస్ఆర్ కళ్యాణమండపంతో మంచి విజయాన్ని సాధించాడు. ఆ తరువాత విడుదలైన సినిమాలు పెద్దగా ఆడకపోయిన ఇపుడు రూల్స్ రంజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గా నేహా శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం రూల్స్ రంజన్. 'సమ్మోహనుడా' అనే పాటతో సినిమా హైప్ పెరగటంతో చిత్రంపై అంచానాలు అమాంతం పెరిగిపోయాయి.
కథ:
మనోరంజన్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ముంబైలోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. మనోరంజన్ తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకొని వాటిని ఫాలో అవుతున్న క్రమంలో తన ఆఫీని వారందరు అతడికి రూల్స్ రంజన్ అని పిలుస్తుంటారు. ఆలా సాగుతుండగా.. హీరోయిన్ సనా (నేహా శెట్టి) హీరో పని చేస్తున్న కంపెనీలో జాయిన్ అవుతుంది. పనిలో ఇద్దరు మంచి మిత్రులవుతారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారే క్రమంలో ఇద్దరికీ మనస్పర్థాల కారణంగా విడిపోతారు. ఇద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి..? మళ్ళీ కలిసారా..? అసలెందుకు విడిపోయారు అన్నదే కథ.
విశ్లేషణ:
ఈ సినిమా కథ సాఫ్ట్ వేర్ కంపేనీలో ప్రారంభమవుతుంది. సినిమా పూర్తిగా కూల్ గా నడుస్తుంది. మొదటి నుంచే సినిమా వినుత్నంగా అలరిస్తుంది. సినిమా చూసినంత వరకు ఫస్టాఫ్ కొత్తగా ఉంటుంది. మనోరంజన్ పాత్రలో హీరో చేసే ఫీట్స్ ఆకట్టుకుంటాయి. ఆ తరువాత హీరోయిన్ ఎంట్రీ.. కామెడీ లవ్ ట్రాక్ తో బాగుంటుంది. వేరే సినిమాతో పోలిస్తే హీరోయిన్ నేహా శెట్టి చాలా అందంగా కనపడుతుంది. కథలో రూల్స్ రంజన్ పాత్రను పరిచయం చేసే సీన్లు ప్రేక్షకుడికి ఓ గొప్ప అనుభూతి కలుగుతుంది. వెన్నెల కిషోర్ ఎంట్రీతో కామెడీ మరో లెవెల్ కు వెళ్తుంది.
ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే.. విలేజ్ లో కొనసాగుతుంది. ఇంటర్వెల్ తరువాత.. తరువాత ఏం జరగబోతుందని ఆసక్తి నెలకొంది. ఇక సెకండ్ హాఫ్ లో హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్‌లను కామెడీ గొప్పగా ఉంటుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కామెడీ మరో రేంజ్ లో ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య జరిగే సీన్స్ కామెడీ గా ఉన్న మంచి ఎమోషన్ క్యారీ అవుతుంది. చివర్లో క్లామాక్స్ వివాహ వేదికలో ముగియటం.. వధువు గురించి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
Also Read: RBI Monetary Policy: వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. స్థిరంగా రెపో రేటు
ఎవరెలా చేశారంటే..?
ఈ సినిమాలో మనోరంజన్ పాత్రలో కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించాడని చెప్పాలి. నిజాయితీ గల అమాయకుడు పాత్రలో కిరణ్ అబ్బవరం చక్కగా ఒదిగిపోయాడు. పాత్ర సరదా సరదాగా ఉన్నా.. బలమైన భావోద్వేగాలను పలికించటంలో సక్సెస్ అయ్యాడు.
మనోరంజన్ పాత్రలో కిరణ్ అబ్బవరం చేసే సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. నేహా శెట్టి తన పాత్రకు న్యాయం చేకూర్చింది. సినిమాలో హీరోయిన్ దే ముఖ్య పాత్ర అవటంతో.. చాలా అందంగా కనపడటమే కాకుండా ఆకర్షించే విధంగా నటించి మెప్పించింది. మిగతా నటుల విషయానికి వస్తే.. వెన్నెల కిషోర్ కామెడీ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్‌లు స్వతహాగా వారు కమెడియన్స్ కాబట్టి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సాంకేతిక అంశాలు..
సినిమా దర్శకుడు రత్నం కృష్ణ డైరెక్షన్ తో పాటు రచనతో కూడా మెప్పించాడు. ఫస్ట్ ఆఫ్ అంతా ముంబైలో కామెడీ, లవ్ ట్రాక్ ను రాసుకొని కథను చాలా ఆసక్తిగా నడిపించారు. అలాగే సెకండ్ ఆఫ్ విలేజ్ లో సాగే ఎమోషన్స్ ను చాలా బాగా చూపించారు. అమ్రిష్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచిన 'సమ్మోహనుడా' అనే పాటను అందించారు. అలాగే సినిమాటో గ్రాఫర్ దులీప్ కుమార్ ఎం.ఎస్ తన పని తనాన్ని చూపించారు. నగరంలో, పల్లేలో రెండు వేరియేషన్లలో చూపించే విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. హీరో కిరణ్ అబ్బవరం మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా చిత్రీకరించారు.
ప్లస్ పాయింట్లు
కథ
కథనం
రచన
దర్శకత్వం
మ్యాజిక్
సమ్మోమనుడా సాంగ్
రేటింగ్: 3/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook