ఏప్రిల్‌ ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. దీంతో ఈ ఏడాది ఎండలు తీవ్రస్థాయిలో ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి. ఈ ఎండలనుంచి తట్టుకోవడానికి శీతల పానీయాలు.. ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఎండల వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి ఒక్కరూ కర్బూజ, మజ్జిగతో పాటు పండ్లు, పండ్ల రసాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


కర్భూజను తినడం గానీ ఆ జ్యూస్‌ తాగడం వల్ల గానీ వడదెబ్బకు గురి కాకుండా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచవచ్చు. అందులో ఉన్న విటమిన్లు, మినరల్స్‌ పలు వ్యాధుల నివారణకు ఎంతో దోహదపడతాయి.


  •  వేసవి సీజన్‌లో నీటి శాతాన్ని పెంచే పండ్లలో కర్బూజా మొదటిది.

  •  వందకు 92 శాతం నీరుండి దాహార్తిని తీర్చడంతో పాటు.. శరీరంలో ఉష్ణోగ్రతని నిలువరిస్తుంది.

  •  కర్భూజలో విటమిన్‌-ఏ, సోడియం, కాల్షియం, మాగ్నీషియం, కార్బోరేట్స్‌, ప్రొటీన్లు, పొటాషియం, ఫైబర్‌, జింక్‌, షుగర్‌ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

  •  మండే ఎండల్లో డీహై డ్రేషన్‌కు గురికాకూడదు అనుకుంటే.. ఈ సీజన్‌ మొత్తం కర్బూజ తీసుకోవలసిందే.

  •  దీనిలో  కిడ్నీల్లో రాళ్లను పోగొట్టే గుణం ఉంది.

  • కర్బూజా తీసుకోవడం వల్ల వడదెబ్బకు గురికాకుండా ఉండటంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల నివారణకు దోహదపడుతుంది.

  •  ఆరోగ్యవంతమైన చర్మం, నేత్ర సంరక్షణకు కర్భూజ ఉపయోగపడుతుంది.

  •  అదే విధంగా అధిక బరువు పెరగకుండా స్లిమ్‌గా ఉండేందుకు దోహదం చేస్తుంది.

  •  ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పండు ఎంతో ప్రయోజనకారి.