‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ నుంచి తేజ తప్పుకోవడంతో దర్శకుడి స్థానం ఖాళీగా ఉండిపోయింది. దీంతో ఇక ఆ బాధ్యత కూడా నందమూరి బాలకృష్ణ స్వీకరిస్తారని, ఆయనే 'ఎన్టీఆర్' చిత్రానికి దర్శకుడని ప్రచారం కూడా జరిగింది. అయితే.. బాలకృష్ణ ఈ విషయంలో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. నిర్మాతగా, నటుడిగా.. ఇక దర్శకుడిగా కూడా మారితే బాధ్యతలు మోయడం కష్టమవుతుందని.. దర్శకత్వ బాధ్యతలను వేరొకరి చేతుల్లో పెట్టాలని భావిస్తున్నారట.


దర్శకత్వ బాధ్యతలను క్రిష్ చేతిలో పెట్టేందుకు బాలయ్య ప్రయత్నిస్తున్నాడట. ఈ మేరకు క్రిష్‌తో బాలయ్య సంప్రదింపులు కూడా జరిపారని, ఆయన కూడా ఓకే చెప్పారని, ఆయనే దాదాపుగా ఖాయమని సమాచారం. అలాగే ఈ మూవీలో హీరో శర్వానంద్ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడట. ఇటీవల ‘ఎన్టీఆర్‌’ చిత్రబృందం శర్వాని సంప్రదించిందని, శర్వా కూడా తన అంగీకారం తెలిపాడని సమాచారం. ఎన్టీఆర్ యుక్తవయసులో ఉన్న పాత్రలో బాలకృష్ణ నటించడం కష్టమైనా పనే. అందుకే యువ ఎన్టీఆర్ పాత్రకోసం శర్వానంద్‌ని ఎంపిక చేశారట.