Mayuki Trailer: ఆకట్టుకుంటున్న యాక్షన్, అడ్వెంచర్ `మయూఖి` మూవీ ట్రైలర్
Mayuki Official Trailer: మయూఖి మూవీ ట్రైలర్‌ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. అమెరికాలోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం జరుపుకోగా.. తాజాగా అక్కడే ట్రైలర్‌ను లాంచ్ చేశారు. యాక్షన్, అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించారు.
Mayuki Official Trailer: టీఐఎం గ్లోబల్ ఫిల్మ్స్ సమర్పణలో నంద కిషోర్, డి.టెరెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ మయూఖి. ఈ ట్రైలర్‌ను సోమవారం అమెరికాలో విడుదల చేశారు. నితిష్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మేనకోడలి కోసం మేనమామ చేసే సాహసాలు.. గ్యాంగ్ వార్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలోనే పూర్తయింది. యూఎస్‌లో స్థిరపడ్డ వందమందికి పైగా ఇండియన్స్, కొంతమంది అమెరికన్లను ఎంపిక చేసిన ఈ సినిమాలో నటీనటులుగా తీసుకున్నారు. వారిని స్వయంగా శిక్షణనిచ్చి నితిన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
ఈ యాక్షన్, అడ్వెంచర్ మూవీ అమెరికాలో నిర్మించినా.. తెలుగువారి అభిరుచికి అనుగుణంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఎంతో శ్రమపడి డల్లాస్ పరిసరాల్లోని అద్భుతమైన లొకేషన్స్ చిత్రీకరణ జరిపినట్లు తెలిపారు. ఈ మూవీ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి త్వరలో ఆడియన్స్ ముందుకు తీసుకువస్తామని నితిన్ కుమార్ తెలిపారు. మయూఖి మూవీని డల్లాస్ ఘర్షణలో అనే సబ్‌టైటిల్‌తో తెరకెక్కించినట్లు చెప్పారు.
ఓ ప్రముఖ ఛానెల్‌లో పదిహేనళ్లపాటు ప్రసారం అయిన పర్యాటక కార్యక్రమం విహారి ది ట్రావెలర్‌కి నితిన్ కుమార్ దర్శకనిర్మాతగా వ్యవహరించారు. ఆయన గతంలో నిర్మించిన లోటస్ పాండ్ అనే చిల్డ్రన్స్ మూవీ హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవానికి ఎంపికైంది. అదేవిధంగా ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కిన ఎ టీచింగ్ ఛెఫ్ లాస్ ఏంజెల్స్‌లో జరిగిన డ్రీమ్ మెషైన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ.. ఫ్లోరిడాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకుని రికార్డు సృష్టించింది. అలానే అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికై ఫైనల్స్‌కు చేరుకుని.. విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.
రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా మయూఖి మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీలో రెన్ని వెంగల, శిరీష, బేబీ మైత్రి, బేబి మయూఖి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు
గణపతి రామం మాటలు అందివ్వగా.. ఎడిటింగ్ బాధ్యతలను జి.అశోక్ కుమార్ నిర్వర్తించారు. సినిమాటోగ్రఫర్‌గా కె.అనిల్ పనిచేయగా.. లుబెక్ లీ మార్విన్ మ్యూజిక్ అందించారు.