ఇక మీదట వాట్సాప్ లో అడ్మిన్ స్థాయిని తగ్గించేయవచ్చు...వారిని కేవలం సభ్యులుగా పరిమితం చేయవచ్చు. ఎలగెలగా ఇది ఎలా సాధ్యమనుకుంటున్నారా .. ఇది సాధ్యమౌతుంది.. వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సాప్‌‌లో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టారు. ఈ నూతన ఫీచర్ ను అనుసరించి గ్రూపు అడ్మిన్ ను డీమోట్ చేసే ఫీచర్ ‘డిస్ మిస్ యాజ్ అడ్మిన్’ను ప్రవేశపెట్టింది. సెట్టింగ్స్ లో రిమూవ్, రిమూవ్ యాజ్ అడ్మిన్ అనే ఆప్షన్లు ఉన్నాయి. అడ్మిన్ గా తొలగించి వారిని సభ్యులుగా పరిమితం చేయడం కొత్త ఫీచర్ తో సాధ్యమవుతుంది. 


సెట్టింగ్స్ లోకి వెళితే వారిని తొలగించాలా లేక కేవలం అడ్మిన్ గానే తొలగించాలా? అన్న ఆప్షన్లు కనిపిస్తాయి. అడ్మిన్ ను తొలగించాలంటే వాట్సాప్ సెట్టింగ్ లో వెళ్లి  రిమూవ్ అడ్మిన్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాల్సి ఉంది. గతంలో  గ్రూప్ అడ్మిన్లుగా ఉన్న వారు ఇతర సభ్యులను డిస్ మిస్ చేసే సదుపాయం మాత్రమే ఉంది. తాజా ఫీచర్ తో అడ్మిన్ కూడా నియంత్రించే వీలుకల్గింది.


ఇక అధిక ప్రాధాన్యం కలిగిన నోటిఫికేషన్లను ముందు చూపించే విధంగా సెట్టింగ్స్ పెట్టుకునే ఫీచర్ ను సైతం బీటా వెర్షన్ లో చేర్చింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్, వెబ్ వెర్షన్లకు సంబంధించి గ్రూపు అడ్మిన్ ను డీమోట్ చేసే ఫీచర్ ‘డిస్ మిస్ యాజ్ అడ్మిన్’ను ప్రవేశపెట్టింది.