లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన రెండు కీలకమైన పాలసీలను ఆ సంస్థ ఉపసంహరించుకోవడం ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. మార్కెట్ నుంచి ఈ రెండు పాలసీలను సంస్థ ఉపసంహరించడంతో పాలసీ హోల్డర్ల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన జీవన్ అమర్, టెక్‌టెర్మ్ ఇన్సూరెన్స్ అనేవి నాన్‌లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, రిస్క్‌తో కూడిన ప్రీమియం జీవిత భీమా పాలసీలు. పాలసీ హోల్డర్ అకాల మరణం సంభవిస్తే..ఆ కుటుంబానికి ఆర్ధికంగా సంరక్షణ లభిస్తుంది. రీ ఇన్సూరెన్స్ రేట్ పెరగడం వల్ల ఈ రెండు పాలసీలను ఎల్ఐసీ ఉపసంహరించుకుందని తెలుస్తోంది. 


ఈ రెండు పాలసీలను ఎల్ఐసీ మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడం వల్ల ఆ ప్రభావం జీవన్ అమర్, టెక్‌టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్లను ఆందోళనకు గురి చేస్తుందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. దీనిపై ఎల్ఐసీ స్పష్టత ఇచ్చింది. మార్కెట్ నుంచి ఎల్ఐసీ..జీవన్ అమర్, టెక్‌టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఉపసంహరించుకున్నా..ప్రస్తుతం నడుస్తున్న ఈ రెండు పాలసీ హోల్డర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. బాండ్‌లో ఇచ్చిన హామీ మేరకు..పాలసీ హోల్డర్లకు అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఈ రెండు పాలసీలకు ప్రీమియం కొనసాగుతుందని వెల్లడించింది.


జీవన్ అమర్, టెక్‌టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను కొత్తగా ఎవరికీ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎల్ఐసీలో జీవన్ అమర్ అనేది నాన్‌లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, రిస్క్‌తో కూడిన ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ పాలసీ హోల్డర్ అకాల మరణం తరువాత ఆ కుటుంబానికి ఆర్ధికంగా రక్షణ కల్పిస్తుంది.


టెక్‌టెర్మ్ ఇన్సూరెన్స్ కూడా నాన్‌లింక్డ్, లాభాపేక్షలేని, ఆన్‌లైన్ టెర్మ్ ఎస్యూరెన్స్ పాలసీగా ఉంది. ఇందులో కూడా పాలసీ హోల్డర్ చనిపోతే ఆ కుటుంబానికి ఆర్ధికంగా సంరక్షణ ఇస్తుంది. 


Also read: 7th Pay Commission: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 7వ వేతన సంఘం అమలుపై కీలక ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook