Lucknow: తండ్రి టార్చర్ తట్టుకోలేక చస్తున్నా.. సూసైడ్ నోట్ లో వెల్లడి.
కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆమె ఉరేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లక్నో: కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆమె ఉరేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతి నగర్ లో ఓ యువతి ఇద్దరు చెల్లెలు, పినతల్లి, తండ్రితో కలిసి నివసిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి తండ్రి, తండ్రి తరపున ఉండే బంధువులు తనని వేధిస్తున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. వాట్సాప్‌లో పెళ్లి!
మానసికంగా తన పినతల్లి తనని వేధిస్తున్నదని, నిత్యం ఎదో ఒక అపవాదుతో నెట్టివేస్తున్నారని లేఖలో పేర్కొంది. ఇంట్లో వాళ్లు అందరూ ఒక్కసారిగా వేధింపులకు గురిచేస్తుండడంతో తట్టుకోలేకపోతున్నానని, బతకడం వృధా అనుకొని ఆత్మ హత్యకు సిద్దమయ్యానని ఆమె పేర్కొంది. అయితే ఆత్మహత్య జరిగిన ప్రదేశంలో సూసైడ్ నోట్‌తో పాటు నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారి కమలేష్ కుమార్ సింగ్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos