మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అసోసియేషన్‌కి చెందిన కోటి రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయనే వివాదం పరిశ్రమలో తీవ్ర చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా ఆ నిధులను దుర్వినియోగం చేశారని అసోసియేషన్ కార్యదర్శి నరేష్ చేసిన ఆరోపణలు ఈ అంశాన్ని మరింత వివాదం చేశాయి. నరేష్ ఆరోపణల అనంతరం మా అసోసియేషన్‌లో రెండు వర్గాలుగా ఏర్పడిన సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ వివాదాన్ని చక్కబెట్టడానికి మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మా అసోసియేషన్‌కి మరింత భారీ మొత్తంలో నిధులు సేకరించడం కోసం ఈ అక్టోబర్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ముఖ్య అతిథిగా అమెరికాలో మా అసోసియేషన్ మరో ఈవెంట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే చిరంజీవి ఈవెంట్ ద్వారా సేకరించిన నిధుల్లో కోటి రూపాయలు గల్లంతయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సూపర్ స్టా్ర్ మహేష్ బాబు తన ఈవెంట్‌ను రద్దు చేసుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 


సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండటానికే ఇష్టపడే మహేష్ బాబు మా అసోసియేషన్‌పై ఆరోపణల నేపథ్యంలో తన నిర్ణయాన్ని విరమించుకున్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అదే కానీ జరిగితే మహేష్ బాబు ఈవెంట్ ద్వారా భారీ మొత్తంలో నిధులు సేకరించవచ్చని మా అసోసియేషన్ వేసుకున్న ప్లాన్స్ కి గండి పడినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.