దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా  సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరికి తోచిన విధంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనదైన శైలిలో అభిమానులకు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సరిలేరు నీకెవ్వరు' సినిమా సూపర్ హిట్ జోష్ లో ఉన్నారు మహేష్ బాబు. ఆ సినిమాలో  ఆయన సైనికుడి పాత్రను పోషించారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా .. సినిమా షూటింగ్ కు సంబంధించి కొన్ని ఫోటోలను మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. షూటింగ్ సందర్భంగా ఆయన సీఐఎఎస్ఎఫ్ అకాడమీలో పలువురు జవాన్లను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. [[{"fid":"181406","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


రాత్రనక, పగలనక, దేశ సరిహద్దుల్లో ప్రాణాలను ఫణంగా పెట్టి .. ప్రజా రక్షణ కోసం పని చేస్తున్న సైనికులను కలవడం ఆనందంగా ఉందని సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. సీఆర్పీఎఫ్ జవాన్లను కలవడం జీవితంలో మధురానుభూతి ఇచ్చిందని తెలిపారు. సైనికులారా మీకు వందనం .. 'సరిలేరు మీకెవ్వరు' అంటూ రాసుకొచ్చారు.  ఇప్పుడు మహేష్ బాబు పోస్ట్ చేసిన  ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


[[{"fid":"181407","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో సైనికులపై ఓ గీతాన్ని కూడా ప్రత్యేకంగా చిత్రీకరించారు. భగ భగ మండే నిప్పుల వర్షం వచ్చినా .. జనగణమన అంటూ దూకేవాడే సైనికుడు..  అంటూ పాట సాగుతుంది.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..