బాలీవుడ్‌లో టాలీవుడ్ అగ్ర నటుడు, ప్రిన్స్ మహేష్ బాబు నటించే అవకాశం ఉందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ చిత్రానికి జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తారని.. తెలుగు, హిందీ భాషల్లో ఆ చిత్రం తెరకు ఎక్కుతుందని వార్తలు వస్తున్నాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్రధాన పాత్రలతో రూపొందుతున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్‌తో ప్రస్తుతం రాజమౌళి బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఆ చిత్రం తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. అలాగే మహేష్ కూడా సుకుమార్‌, సందీప్ రెడ్డితో చేయాల్సిన సినిమాలు పూర్తయ్యాక ఈ మెగా ప్రాజెక్టుపై వర్క్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మ‌హేష్‌.. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్‌తో కలిసి మహేష్ నటిస్తున్నాడు. అలాగే పూజా హెగ్డే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఈ సినిమా పేరు "మహర్షి" అని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మహేష్ "భరత్ అనే నేను" చిత్రంతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 


ఇప్పటికే బాలీవుడ్‌లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రామ్ చరణ్, రానా, సుధీర్ బాబు మొదలైన వారు డైరెక్ట్ మూవీస్ చేశారు. మహేష్ బాబుకి కూడా గతంలో బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు అనేక ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన తిరస్కరించారు. రాజమౌళితో ఆయన ఒకవేళ అనుకున్న ప్రాజెక్టు సైన్ చేస్తే.. అది నిజంగానే వండర్ అని అభిమానులు అంటున్నారు.