`మహర్షి` కోసం సిద్ధమవుతున్న పల్లెటూరు
వంశీపైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా కోసం ఫిలిం సిటీలో ఓ పల్లెటూరు సెట్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అశ్వనీదత్, దిల్‌రాజు, ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. అమెరికా షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో ఆ తర్వాతి షెడ్యూల్ మొదలవనుంది. ఈ షెడ్యూల్‌లో భాగంగానే మహేశ్‌బాబు, పూజా హెగ్డే సహా ఇతర నటీనటులపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సునిల్ బాబు పర్యవేక్షణలో ఈ సెట్టింగ్ రూపొందుతోందని, చిత్ర యూనిట్ అమెరికా నుంచి తిరిగొచ్చే సమయానికి సెట్ సిద్ధమవుతుందని చిత్రయూనిట్ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.
2019 ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. తొలిసారిగా అల్లరి నరేష్ మహేష్ బాబు సినిమాలో ఓ అతిథి పాత్ర పోషిస్తున్నాడు.