Mahesh Babu: సర్కార్ వారి పాట.. ఫ్యాన్స్‌ని సస్పెన్స్‌కి గురిచేస్తోన్న పోస్టర్
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ ( Good news to Mahesh babu fans ). టాలీవుడ్ సూపర్‌స్టార్ తర్వాతి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ డైరెక్షన్‌లో మహేశ్ బాబు చేయనున్న సినిమాకు సంబంధించిన టైటిల్‌పై అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ ( Good news to Mahesh babu fans ). టాలీవుడ్ సూపర్ స్టార్ తర్వాతి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ డైరెక్షన్‌లో మహేశ్ బాబు చేయనున్న సినిమాకు సంబంధించిన టైటిల్‌పై అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చేసింది. తన తండ్రి, తెలుగు సినిమా తొలి తరం సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ ( HBD superstar Krishna ) తెలియజేస్తూ ట్విటర్ ద్వారా అభిమానుల ముందుకొచ్చిన మహేష్ బాబు.. తన తర్వాతి సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సర్కారు వారి పాట అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
సర్కార్ వారి పాట మూవీ టైటిల్ పోస్టర్ ( Sarkaru Vaari Paata movie poster ) ప్రత్యేకతల విషయానికొస్తే... మహేష్ బాబు ఫేస్‌కట్‌పై అభిమానులకు సస్పెన్స్ తప్పలేదు. ఎందుకంటే సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ బాబు అప్పియరెన్స్ ఎలా ఉంటుందనేది అప్పుడే తెలియనివ్వకుండా.. ఆయన్ను వెనక నుంచి సైడ్ యాంగిల్లో చూపించారు. మహేష్ బాబు చెవికి రింగు, మెడపై రూపాయి కాయిన్ డిజైన్‌తో టాటూ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మహేష్ బాబు ఈ ట్వీట్ అలా చేశారో లేదో ఆ వెంటనే #SarkaruVaariPaata హ్యాష్‌ట్యాగ్‌తో సర్కార్ వారి పాట టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read also : Tamil movies: ఈ తమిళ చిత్రాల కథలే ఇప్పుడు నిజమవుతున్నాయా ?
ఇక ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత రూపొందుతున్న ఈ చిత్రం కూడా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని మహేష్ బాబు అభిమానులు ఆశిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..