మహేష్ బాబు నటించిన అప్‌కమింగ్ సినిమా సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. మహేష్ బాబు ఫ్యాన్స్‌ అంచనాలకు తగినట్టుగానే సరిలేరు నీకెవ్వరు టీజర్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు కామెడి ఎంటర్‌టైనర్స్‌తో అలరించిన అనిల్ రావిపూడి తొలిసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతోనే అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. గీత గోవిందం సినిమాతో తెలుగు ఆడియెన్స్‌ మది దోచుకున్న రష్మిక మందన్న మహేష్ బాబుకు జంటగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా.. తాజాగా విడుదలైన ఈ టీజర్ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం... మీరు కూడా సరిలేరు నీకెవ్వరు టీజర్‌పై ఓ లుక్కేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING