నాగచైతన్య -సమంత జంట కలిసి నటించిన మజిలీ మూవీ సైలెంట్ గా దూసుకెళ్లోంది. నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ మూవీ..భారీగా కలెక్షన్లు వసూలు చేస్తోంది. నిన్నటితో 10 రోజులు పూర్తిచేసుకున్న ఈ మూవీ బ్రేక్-ఈవెన్ అవ్వడమే కాకుండా వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్ల రూపాయల గ్రాస్ తో రికార్డు క్రియేట్ చేసింది.


శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మోస్ట్ ఎమోషనల్ మూవీగా పేరు తెచ్చుకుంది. నాగ చైతన్య-సమంత పెయిర్ కు మంచి మార్కులు పడ్డంతో పాటు.. విడదలైన 10 రోజుల్లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం గమనార్హం.