వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మిభాయి జీవితంగా ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం 'మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చారిత్రక చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన కొన్ని ఫస్ట్ లుక్ పోస్టర్లకు  ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్‌ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు క్రిష్ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన షూటింగ్ దాదాపుగా పూర్తయిన తర్వాత తప్పుకున్నారు. సినిమాలోని మిగిలిన కొన్ని సీన్లును కంగనా రనౌత్ డైరెక్ట్ చేసి సినిమాను పూర్తి చేసిందని టాక్. ఆ సమయంలో కంగన వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయి. దర్శకురాలిగా కంగనా తన పేరును టైటిల్స్‌‌లో వేసుకుంటారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ అనుమానాలన్నింటిని టీజర్‌తో సమాధానం చెప్పింది మూవీ యూనిట్. దర్శకుడిగా రాధాకృష్ణ జాగర్లమూడి పేరును టైటిల్స్‌‌లో చూపించింది.


ఈ సినిమాను నిర్మాత కమల్ జైన్... జీ స్టూడియోస్‌తో కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తుండగా.. శంకర్- ఎహసాన్- లాయ్‌లు సంగీతం సమకూర్చారు. ఈచిత్రం వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25, 2019న విడుదల కాబోతోంది. కాగా ఇదే రోజు హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30' కూడా విడుదల కానుంది. 'మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' టీజర్‌ను మీరూ చూడండీ..