aparna balamurali video : అపర్ణా బాలమురళితో స్టూడెంట్ అనుచిత ప్రవర్తన.. నీచమంటూ మంజిమా మోహన్ ట్వీట్
aparna balamurali video అపర్ణా బాలమురళికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఇందులో అపర్ణతో ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ఫీ కోసమని దగ్గరకు వచ్చి.. చేతులు వేసేందుకు ప్రయత్నించాడు.
Manjima mohan on aparna balamurali video సెలెబ్రిటీలు బయటకు వస్తే ఒక్కోసారి అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. అది హీరోలైనా, హీరోయిన్లైనా సరే ఒక్కోసారి అభిమానులు పరిధి దాటి ప్రవర్తిస్తుంటారు. కొందరు ఆకతాయిలు కూడా ఉంటారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియని తుంటరి వాళ్లు కూడా ఉంటారు. అలాంటి ఆకతాయి, తుంటరే అపర్ణా బాలమురళికి ఎదురయ్యాడు. ఓ కాలేజ్ ఈవెంట్‌కు అపర్ణా బాలమురళి ముఖ్య అతిథిగా వెళ్లింది.
అక్కడ ఒక స్టూడెంట్ స్టేజ్ మీదకు వచ్చాడు. ఫోటో తీసుకోవాలనే నెపంతో అపర్ణను రమ్మన్నాడు. చేయి పట్టి మరీ లాక్కొచ్చాడు. ఫోటోకు పోజు ఇచ్చే నెపంతో ఆమె మీద చేతులు వేసి, దగ్గరకు లాక్కొవాలని ప్రయత్నించాడు. దీంతో అపర్ణా అసౌకర్యానికి గురైంది. ఇంటి ఈ పిచ్చి చేష్టలు అన్నట్టుగా అపర్ణ కాస్త కోపంగా చూసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇలాంటి ఘటనలు సెలెబ్రిటీలకు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు అపర్ణా బాలమురళి మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ సింపతీని దక్కించుకుంది. అలా ఎలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు అని సదరు స్టూడెంట్‌ను జనాలు తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ మంజిమ మోహన్ కూడా స్పందించింది. ఇది నమ్మకలేకపోతోన్నా.. నీచ ప్రవర్తన అంటూ ట్వీట్ వేసింది.
అపర్ణా బాలమురళి ఒకే ఒక సినిమాతో ఫేమస్ అయింది. ఆకాశం నీహద్దురా సినిమాతో సూర్యకు సరి సమానంగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక మంజిమా మోహన్ అయితే ఈ మధ్యే తన ప్రియుడ్ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిల్చింది.
Also Read: Anchor Vishnupriya : బాలయ్య మీద విష్ణు ప్రియ కౌంటర్ వేసిందా?.. దండం పెట్టేసిన యాంకర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook