బ్రేకింగ్ న్యూస్: దట్టమైన అడవుల్లో పోరాడుతున్న చిరంజీవి !!
కేరళలోని దట్టమైన అడవుల్లో మెగాస్టార్ చిరంజీవి పోరాడుతున్నారు. ఇదేదో ప్రమాదంలో చిక్కుకొని అనుకునేరు... `సైరా` షూటింగులో...
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్థార్ చిరంజీవి హీరో 'సైరా' మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ లో భాగంగా కేరళ అడవుల్లో భారీ పోరాట సన్నివేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో చిరంజీవి అక్కడ ఘూటింగ్ లో పాల్గొంటున్నారు. మొత్తం 10 రోజుల పాటు అక్కడ పోరాట సన్నివేశాలనే చిత్రీకరిస్తారని పేర్కొన్న చిత్రయూనిట్ ....ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు
ఇక్కడి షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మళ్లీ హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ షూటింగు జరగనుంది. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుంది. చిరుతో పాటు బిగ్ బి అమితాబ్ , జగపతిబాబు, విజయ్ సేతుపతి , సుదీప్ వంటి స్టార్స్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ ఈ ఏడాది తీయార్థంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అకున్నవి అన్ని సవ్యంగా జరిగితే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ మూవీ తెరపైకి రానుంది.